మంత్రిమండలి

ప‌ర్య‌ట‌న రంగం లో స‌హ‌కారాన్ని ప‌టిష్టం చేసుకొనేందుకు భార‌త‌దేశం మ‌రియు ఉజ్‌బెకిస్తాన్ ల మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 26 SEP 2018 4:19PM by PIB Hyderabad

ప‌ర్య‌ట‌న రంగం లో స‌హ‌కారాన్ని ప‌టిష్టం చేసుకొనేందుకు భార‌త‌దేశం మ‌రియు  ఉజ్‌బెకిస్తాన్ ల మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందానికి (ఎంఒయు కు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ వహించిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఉజ్‌బెకిస్తాన్ అధ్య‌క్షులు 2018వ సంవ‌త్స‌రం అక్టోబ‌రు 1వ తేదీ నాడు భార‌త‌దేశాన్ని సంద‌ర్శించే సంద‌ర్భంగా ఈ ఎంఒయు పై సంత‌కాలు జ‌రుగ‌నున్నాయి.

ప్ర‌యోజ‌నాలు:

ప‌ర్య‌ట‌క రంగం లో ఎంఒయు పై సంత‌కాలు చేయ‌డం ఇరు దేశాల లో ప‌ర్య‌ట‌క రంగం లో స‌హ‌కారాన్ని పెంపొందించుకొనేందుకు ఒక సంస్థాగ‌త‌మైన యంత్రాంగాన్ని ఏర్పర‌చ‌డం లో ఉభ‌య దేశాల‌ కు స‌హ‌య‌కారి కాగ‌ల‌దు.  ఉజ్‌బెకిస్తాన్ నుండి దేశం లోకి విదేశీ యాత్రికుల ఆగ‌మ‌నాన్ని పెంచేందుకు కూడా ఇది దోహ‌దం చేయ‌గ‌ల‌దు.  త‌త్ఫలితంగా ఆర్థ‌కాభివృద్ధి తో పాటు, ఉపాధి క‌ల్ప‌న‌ కు కూడా ఊతం ల‌భిస్తుంది.  స్థూల‌మైన ఫ్రేమ్ వ‌ర్క్ ప‌రిధి లో మ‌రియు స‌హ‌కారానికి ఉద్దేశించిన రంగాల లో సంబంధిత వ‌ర్గాల‌న్నింటికీ ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు అందుతూ దీర్ఘ‌కాలిక ప్రాతిప‌దిక‌న ప‌ర్య‌ట‌క రంగ స‌హ‌కారం కొన‌సాగేందుకు సానుకూల స్థితిగ‌తుల‌ను ఈ ఎంఒయు ఏర్పర‌చ‌ గ‌లుగుతుంది.  దీనికి తోడు ఈ ఎంఒయు దీని లో నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను సాకారం చేసేందుకు చ‌ర్య‌ల‌ అమ‌లు లో ఉత్త‌మ‌ ప‌ద్ధ‌తుల‌ను జోడించేందుకు కూడా త‌గిన అవకాశాల‌ను అన్వేషిస్తుంది.  


**



(Release ID: 1547510) Visitor Counter : 110