మంత్రిమండలి

త‌వాంగ్ లోని 5.99 ఎక‌రాల మేర విస్త‌రించి ఉన్న స‌శ‌స్త్ర సీమా బ‌ల్ కు చెందిన భూమి ని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌ద‌లాయించేందుకు ఆమోదం తెలిపిన మ‌త్రివ‌ర్గం

Posted On: 04 JUL 2018 2:40PM by PIB Hyderabad

త‌వాంగ్ లో స‌శ‌స్త్ర సీమా బ‌ల్ (ఎస్ఎస్‌బి) కు చెందిన 5.99 ఎక‌రాల భూమి ని మెగా ఫెస్టివల్ కమ్ మల్టిపర్పస్ గ్రౌండ్ ను   నిర్మించ‌డానికి గాను అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి బదిలీ చేసేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.   
 
వాహ‌నాల‌ను నిలిపి వుంచే స‌దుపాయం (4.73 ఎకరాలు) తో కూడిన‌ మరి అలాగే రింగ్ రోడ్డు నిర్మాణానికి (1.26 ఎకరాలు) తో కూడిన ఒక మెగా ఫెస్టివ‌ల్-క‌మ్-మ‌ల్టి ప‌ర్ప‌స్ గ్రౌండ్ యొక్క నిర్మాణానికిగాను త‌వాంగ్ లోని ఎస్ఎస్‌బి క్యాంప‌స్ ప‌రిధి లో 5.99 ఎక‌రాల విస్తీర్ణం క‌లిగిన భూభాగాన్ని తగినదిగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గుర్తించింది.  త‌ద‌నుగుణంగా ఈ 5.99 ఎక‌రాల భూమి ని త‌మ‌కు బ‌ద‌లాయించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం వారు అభ్య‌ర్ధించారు.

భార‌త ప్ర‌భుత్వం (ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ) ఇప్ప‌టికే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని త‌వాంగ్ లో మెగా-ఫెస్టివ‌ల్-క‌మ్-మ‌ల్టి ప‌ర్ప‌స్ గ్రౌండ్  నిర్మాణం కోసం ఒక ప్రాజెక్టు ను 2016 మార్చి నెల‌లో మంజూరు చేసింది.  వివిధ ప‌ర్యాట‌క ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ కు ఈ మెగా-ఫెస్టివ‌ల్-క‌మ్-మ‌ల్టి ప‌ర్ప‌స్ గ్రౌండ్ ను ఉప‌యోగించ‌నున్నారు.


***



(Release ID: 1537847) Visitor Counter : 104