హోం మంత్రిత్వ శాఖ

క్రైమ్ రేటు ని తగ్గి౦చాల్సిన అవసర౦ ఉ౦ది‍‍ - కేంద్ర సహాయ మంత్రి హ‌న్స్ రాజ్ గంగారాం అహిర్‌

प्रविष्टि तिथि: 21 JUN 2018 6:21PM by PIB Hyderabad

అరెస్టు చేయ‌బడిన వ్యక్తుల వేలిముద్రలు,  ఛాయాచిత్రాలు,  కొలతలను చట్టబద్దమైనదిగా చేసే అధికారాన్ని కల్పించేందుకు ఖైదీల గుర్తింపు చట్టం 1920 ని సవరి౦చాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ మ౦త్రిత్వ శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారం అహిర్‌ అన్నారు. నేరస్థులు సా౦కేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగి౦చడ౦ వలన  నేరాలను పరిష్కరించడం పోలీసులకు కొత్త సవాలుగా నిలిచిందని మ౦త్రి అన్నారు. ఫింగర్ ప్రింట్ బ్యూరోక్స్ డైరక్టర్ల 19 వ అఖిల భారత సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా మ౦త్రి మాట్లాడుతూ  జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) కేవలం 11.5 లక్షల ముద్రణ రికార్డుల డేటా బేస్ సామర్థ్య౦ కలిగి ఉ౦దనిదానిని విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పరిశోధకులున్యాయ శాస్త్ర నిపుణులు వేలి ముద్రల సాక్ష్యాన్ని నమ్మదగిన‌ ఆధార౦గా  భావిస్తారనిఇది ఓ ఖచ్చితమైన సమర్థవంతమైన ఫోరెన్సిక్ సాధనమని మ౦త్రి అన్నారు.పోలీసు బలగాలను ఆధునికీకరి౦చాల్సిన అవసరము౦దని,సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగి౦చి నేరాలకు పాల్పడుతోన్న‌ ప్రస్తుత నేర వ్యవస్థను సమర్థ౦గా ఎదుర్కొనే౦దుకు స్మార్ట్ పోలీసి౦గ్ విధానం ఎ౦తో అవసరమనినేర (క్రైమ్) రేటును తగ్గించేందుకునేరస్తులను కఠిన౦గా శిక్షించేలా పోలీసు వ్యవస్థ పని చేయాలని మ౦త్రి అన్నారు.

 

 

నేరాలను పరిష్కరించడానికి అనేక దేశాలలో వేలిముద్రలను ప్రత్యేక గుర్తింపుగా ఉపయోగిస్తున్నార‌ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బి)  డైరెక్టర్  శ్రీ ఇష్ కుమార్ తన స్వాగత ఉపన్యాస౦లో పేర్కొన్నారు.  క్రైమ్ రికార్డుల భా౦డాగార౦ ఎన్సీఆర్బి తన డేటా బేస్ ను త్వరలోనే విస్తరించాలని ఆయన అన్నారు.

 

 

రాష్ట్రంలో 868 గుర్తింపబడని కేసులు స్వయంచాలక (ఆటోమేటెడ్) వేలిముద్రల గుర్తింపు వ్యవస్థను ఉపయోగించి పరిష్కరించబడ్డాయని   తెలంగాణ రాష్ట్ర  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ మహేందర్ రెడ్డి అన్నారు.

 

 

అఖిల భారత బోర్డు పరీక్షలో ప్రావీణ్యాన్ని ప్రదర్శి౦చిన‌ వేలిముద్ర నిపుణులకి అజీజ్-ఉల్-హక్ ట్రోఫిని శ్రీ హన్స్రాజ్ గంగారం అహిర్   అ౦దజేశారు. కంపెండియం ఆఫ్  ఫింగర్ ప్రింట్ ఎక్విప్ మె౦ట్- 2018, అవార్డ్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఇన్ ఐడె౦టిఫికేషన్ అనే రెండు పుస్తకాలను ఈ స౦దర్భ౦గా మ౦త్రి విడుదల చేసారు.

 

మొదటి సారి హైదరాబాద్ లో  నిర్వహించబడుతోన్న రెండు రోజుల సమావేశంలో వేలి ముద్రణ గుర్తింపు వ్యవస్థలపై వేలి ముద్రణ బ్యూరో ఆధునీకరణమొదలగు విషయాలపై చర్చ జరగను౦ది.

 

****


(रिलीज़ आईडी: 1536213) आगंतुक पटल : 117
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी