మంత్రిమండలి

భార‌త‌దేశం మ‌రియు ఈక్వ‌టోరియ‌ల్ గినియ కు మ‌ధ్య సాంప్ర‌దాయ‌క వైద్య ప‌ద్ధ‌తుల రంగంలో స‌హ‌కారానికి సంబంధించిన ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 16 MAY 2018 3:44PM by PIB Hyderabad

భార‌త‌దేశం మ‌రియు ఈక్వ‌టోరియ‌ల్ గినియ కు మ‌ధ్య సాంప్ర‌దాయ‌క వైద్య ప‌ద్ధ‌తుల రంగంలో స‌హ‌కారానికి ఉద్దేశించినటువంటి అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రానికి (ఎమ్ఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.  ఈ ఎమ్ఒయు పై 2018 ఏప్రిల్ 8వ తేదీన సంత‌కాలు అయ్యాయి.

సాంప్ర‌దాయ‌క వైద్య ప‌ద్ధతుల రంగంలో ఉభ‌య దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ఈ ఎమ్ఒయు ప్రోత్స‌హిస్తుంది.

ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ కోర్సులు, స‌మావేశాలు మ‌రియు నిపుణుల డిప్యుటేష‌న్ ల‌ను నిర్వ‌హించ‌డానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక వ‌న‌రుల‌ను ఆయుష్ మంత్రిత్వ శాఖ కు కేటాయించిన బ‌డ్జెట్ మ‌రియు ఇప్ప‌టికే అమ‌లవుతున్నటువంటి ప్ర‌ణాళికా ప‌థ‌కాల నుండి వెచ్చించ‌డం జ‌రుగుతుంది.


***



(Release ID: 1532446) Visitor Counter : 85