ఆయుష్
భారతదేశానికి మరియు కొలంబియా కు మధ్య సాంప్రదాయక వైద్య పద్ధతుల రంగంలో సహకారానికి సంబంధించిన ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
प्रविष्टि तिथि:
16 MAY 2018 3:41PM by PIB Hyderabad
భారతదేశపు సాంప్రదాయక వైద్య పద్ధతులపై భారతదేశానికి మరియు కొలంబియా కు మధ్య సహకారానికి ఉద్దేశించినటువంటి ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రాన్ని (ఎంఒయు) కుదుర్చుకోవడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఇది కొలంబియా లో భారతదేశ సాంప్రదాయక వైద్య పద్ధతుల ప్రచారానికి, ఇంకా ఆ వైద్య పద్ధతుల ప్రోత్సాహానికి బాట పరచనుంది.
ఈ ఎంఒయు పర్యవసానంగా సాంప్రదాయక వైద్య పద్ధతులను అనుసరించే వారికి శిక్షణను ఇవ్వడం కోసం నిపుణుల రాక పోక లతో పాటు సమన్వయ పూర్వకమైన పరిశోధనలు జరిపేందుకు కూడా అవకాశం లభించనుంది. దీని ద్వారా ఔషధాల అభివృద్ధి మరియు సాంప్రదాయక వైద్య పద్ధతుల అభ్యాసం ముందుకు సాగగలదని ఆశిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 1532415)
आगंतुक पटल : 139