వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

120 స్టార్ట్- అప్ లలో 569 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా 6515 ఉద్యోగాల కల్పన

Posted On: 06 APR 2018 4:42PM by PIB Hyderabad

    స్టార్ట్- అప్ ల కోసం ఉద్దేశించినటువంటి 19 అంశాలతో కూడిన ఒక కార్యాచరణ ప్రణాళిక ను 2016 జనవరి లో ప్రారంభించడం జరిగింది.  ఈ కార్యాచరణ ప్రణాళిక లో సింప్లిఫికేషన్ అండ్ హ్యాండ్ హోల్డింగ్నిధుల పరంగా తోడ్పాటును అందించడం మరియు ప్రోత్సాహకాల మంజూరుపరిశ్రమ- విద్యాసంస్థ ల మధ్య భాగస్వామ్యం ఇంకా ఇన్ క్యుబేషన్ ల వంటి రంగాలు భాగంగా ఉన్నాయి.  ఈ కార్యాచరణ ప్రణాళిక ను విజయవంతంగా అమలుపరచే బాధ్యత ను వాణిజ్యం మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ లోని పారిశ్రామిక విధానం ప్రోత్సాహక విభాగం (డిఐపిపి) కి అప్పగించారు.

స్టార్ట్- అప్ ల గుర్తింపు

స్టార్ట్- అప్ ల నిర్వచనంలో 2017 మే నెలలో చేసిన మార్పుతో పాటు గుర్తింపు ప్రక్రియకు దిద్దిన మెరుగుల ఫలితంగా గుర్తింపు ధ్రువపత్రం మంజూరుకు పట్టే కాలం 10- 15 రోజుల నుండి ప్రస్తుతం 1- 4 రోజులకు తగ్గింది.  దీనితో 2016- 17 లో 797స్టార్ట్- అప్ ల కు గుర్తింపు పత్రాలు మంజూరు కాగా, 2017- 2018 ఆర్థిక సంవత్సరంలో 7968 స్టార్ట్- అప్ లు గుర్తింపు నకు నోచుకొన్నాయి.  2016 జనవరి నాటి నుండి మొత్తం 8765 స్టార్ట్- అప్ లు డిఐపిపి నుండి గుర్తింపును పొందాయి.  గుర్తింపు పొందిన స్టార్ట్- అప్ లలో 15 శాతం స్టార్ట్- అప్ లు ఐటీ సర్వీసులకు చెందినవి, 9 శాతం ఆరోగ్య సంరక్షణ మరియు లైఫ్ సైన్సెస్ రంగానికి చెందినవి, 7 శాతం విద్య రంగానికి చెందినవి, 6 శాతం వృత్తిపరమైన మరియు వాణిజ్య సేవలకు చెందినవి, 4శాతం వ్యవసాయ రంగానికి చెందినవి అయి ఉన్నాయి.  స్టార్ట్- అప్ ల డైరెక్టర్ల లో 35 శాతం డైరెక్టర్ లు మహిళలు.  6954 స్టార్ట్- అప్ లు 81,264 మందికి ఉపాధిని కల్పించినట్లు వెల్లడించాయి.  దీనికి తోడు, 88 స్టార్ట్- అప్ లను పన్ను మినహాయింపులకు అర్హమైనవిగా అంతర్ మంత్రిత్వ శాఖా మండలి ధ్రువీకరించింది.

ప్రభుత్వ సేకరణలలో ప్రాధాన్యం

     ప్రభుత్వానికి చెందినటువంటి ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్ అయిన Gem పోర్టల్ ను Startup India పోర్టల్ తో పూర్తిగా జోడించడం జరిగింది.  స్టార్ట్- అప్ లు ప్రస్తుతం వాటి ఉత్పత్తులనుసేవలను  Gem పోర్టల్ లో పొందుపరచుకోవచ్చు.  అంతే కాదుఅనుభవంప్రయర్ టర్నోవర్ మరియు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ల వంటి ప్రమాణాలలో సడలింపులను కూడా స్టార్ట్- అప్ లు అందుకోగలుగుతాయి.

స్టార్ట్- అప్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ స్కీము

     పేటెంట్ ఫైలింగ్ రుసుము లో 80 శాతం తగ్గింపునకుట్రేడ్ మార్క్ ఫైలింగ్ రుసుము లో 50  శాతం తగ్గింపునకు స్టార్ట్- అప్ లు అర్హతను సంపాదించుకొన్నాయి.  అవి పేటెంట్ దరఖాస్తుల వేగవంతమైన పరిశీలన తో పాటు ఫ్రీ ఫెసిలిటేషన్ కు కూడా అర్హతను సాధించుకొన్నాయి.  ఈ పథకం తో 671 పేటెంట్ దరఖాస్తుదారులకు, 941 ట్రేడ్ మార్క్ దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరింది.  అంతే కాకుండా, 144 దరఖాస్తుల విషయంలో శీఘ్ర పరిశీలన సాధ్యమైంది.

స్టార్ట్- అప్ ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్

     25 విసి ఫండ్ లకు 1136 కోట్ల రూపాయలు సహాయం చేసేందుకు ఎస్ఐడిబిఐ (సిడ్బి) ముందుకు వచ్చింది.  దీనితో ఈ విసి ఫండ్ లు 120 స్టార్ట్- అప్ లలో 569 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి.  ఈ స్టార్ట్- అప్ లు 1184 మంది మహిళలతో సహా మొత్తం 6515 మందికి ఉద్యోగాలను ఇచ్చాయి.

స్టార్ట్అప్ ఇండియా హబ్

     విజ్ఞానం ఆదాన ప్రదానానికినిధుల లభ్యతకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పేందుకుగాను సంప్రదించదగ్గ ఒకే పాయింట్ గా స్టార్ట్అప్ ఇండియా హబ్ ను కూడా డిఐపిపి నెలకొల్పింది.  స్టార్ట్- అప్ ల తోనుఇన్ క్యుబేటర్ లతోనుపెట్టుబడిదారులతోనుమెంటార్ ల తోనుకార్పొరేట్ లతోనుప్రభుత్వ సంస్థ లతోను కలసి ఈ స్టార్ట్అప్ ఇండియా హబ్ పనిచేస్తుంది.  ఈ హబ్ టెలిఫోన్ఇమెయిల్ ఇంకా సామాజిక మాధ్యమాల ద్వారా 88,566 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అంతే కాకుండా ఈ హబ్ వ్యాపార ప్రణాళికను రూపొందించుకోవడంనిధుల సమీకరణవిధానపరమైన సహాయం వంటి అంశాలలో 494 స్టార్ట్- అప్ లకు మార్గదర్శకత్వాన్ని వహించింది.  25 కార్పొరేట్ లకు మెంటార్ షిప్ నుస్టార్ట్- అప్ లకు మరియు ఆంత్రప్రెన్యోర్ లకు ప్రొ- బానో సర్వీసులను అందించడం కోసం భాగస్వామ్యాన్ని కుదుర్చుకొంది.  స్టార్ట్- అప్ లకువ్యక్తులకు మరియు ఇతరత్రా ఇకోసిస్టమ్ మెంబర్ లకు ఒకరితో మరొకరికి సంధానించడానికిసంబంధం ఉండేటటువంటి ప్రభుత్వ పథకాలను అన్వేషించడానికికార్యక్రమాలలో మరియు పోటీ లలో పాలుపంచుకొనేటట్లు చూడడానికిఆన్ లైన్ లెర్నింగ్ ప్రోగ్రాములు తదితర వనరులను చేరువగా తీసుకురావడానికిగాను 2017 జూన్ లో స్టార్ట్అప్ ఇండియా హబ్ ను ఆరంభించారు.  41,000 కు పైగా యూజర్ లు హబ్ లో వారి పేర్లను నమోదు చేసుకొన్నారు. హబ్ ప్రారంభం అయిన నాటి నుండి 4.4 మిలియన్ కు పైగా యూజర్ లు ఈ హబ్ ను దర్శించారు.  ఈ వేదిక మీది నుండి 260 మంది మెంటార్ లు ఇంకా ఇన్వెస్టర్ లు, 140 ఇన్ క్యుబేటర్ లు మరియు 10 గవర్నమెంట్ ఏజెన్సీ లతో స్టార్ట్- అప్ లు సంధానం అయ్యేందుకు వీలు ఉంది.  నవ పారిశ్రామికవేత్తలు తగిన వ్యాపార ప్రణాళికలను సిద్ధం చేసుకొని తమ వ్యాపారాలను ఆవిష్కరించుకొనేటట్లుగా వారికి సహాయాన్ని అందజేసేందుకు స్టార్ట్అప్ ఇండియా లెర్నింగ్ ప్రోగ్రామ్ పేరుతో ఒక ఆన్ లైన్ ప్రోగ్రాము ను సైతం ఈ హబ్ లో ఒక భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆన్ లైన్ ప్రోగ్రాము లో ఇంతవరకు 2 లక్షల మందికి పైగా వ్యక్తులు తమ పేర్లను నమోదు చేసుకొన్నారు.

స్టార్ట్అప్ ఇకోసిస్టమ్స్ పటిష్టీకరణలో రాష్ట్రాల భాగస్వామ్యం

     ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన వేళలో కేవలం 4 రాష్ట్రాలు స్టార్ట్ అప్ విధానాన్ని అమలుపరుస్తూ ఉన్నాయి.  కాగాప్రస్తుతం 19 రాష్ట్రాలు స్టార్ట్ అప్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.  ఈ ఉద్యమాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు 2018ఫిబ్రవరి 6 వ తేదీ న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల స్టార్ట్ అప్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ను ప్రారంభించడమైంది.   రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు వాటి వాటి అధికార పరిధులలో స్టార్ట్అప్ లు వర్ధిల్లగలిగే ఓ వ్యవస్థను బలోపేతం చేసే దిశలో సంస్కరణాత్మక చర్యలను చేపట్టే లాగా రాష్ట్రాలనుకేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహించడం ఈ ఫ్రేమ్ వర్క్ యొక్క కీలక ధ్యేయం.

అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక సహకారం

     స్టార్ట్అప్ లు వర్ధిల్లేందుకు బలమైన వ్యవస్థలను కలిగివున్నటువంటి ఇజ్రాయల్సింగపూర్పోర్చుగల్ఇంకా స్వీడన్ ల వంటి దేశాలతో ద్వైపాక్షిక సహకారాన్ని స్టార్ట్అప్ ఇండియా హబ్ ఏర్పాటుచేసుకొంది.  ఫలితంగామార్కెట్ లు అందుబాటు లోకి రావడంతో పాటు పెట్టుబడులకు దన్ను లభిస్తుంది.  ఇండియా ఇజ్రాయల్ ఇన్నొవేషన్ చాలెంజ్ లో భాగంగా భారతదేశం నుండి 665 స్టార్ట్అప్ లుఇజ్రాయల్ నుండి 150 స్టార్ట్అప్ లు వ్యవసాయంజలంఇంకా ఆరోగ్య రంగాలలో ఆన్ లైన్ చాలెంజ్ ను స్వీకరించి పరిష్కార మార్గాలను ప్రతిపాదించాయి.  ఉభయ దేశాల నుండి 18 స్టార్ట్అప్ లను ఎంపిక చేయడం జరిగింది. వాటికి నగదు బహుమతులతో పాటు 6 నెలల పాటు ఇన్ క్యుబేషన్ సంబంధిత మద్దతుభారతదేశం లోనుఇజ్రాయల్ లోను మార్కెట్ లభ్యత కార్యక్రమం వంటివి ఇవ్వజూపడమైంది.

నియంత్రణల పరంగా సరళీకరణ

     వ్యాపారం సులువుగా చేసే ప్రక్రియకు మెరుగులు దిద్దేందుకుమూలధన సమీకరణకునిబంధనలను పాటించే భారాన్ని తగ్గించేందుకు సంబంధించిన 21 నియంత్రణపరమైనటువంటి మార్పులను చేపట్టడం జరిగింది.  స్టార్ట్ అప్ లకు ఇన్ సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ను 90 రోజుల లోపలఇతర సంస్థలకు 180 రోజుల లోపల పూర్తి చేయాలనే నిబంధనను తీసుకురావడమైంది.

స్టార్ట్అప్ యాత్ర లు మరియు కేంపస్ కనెక్ట్ ప్రోగ్రాములు

     భారతదేశంలో నవ పారిశ్రామికులు కాదగ్గ ప్రతిభావంతులను వెతికి వారు స్టార్ట్ అప్ లను ఏర్పాటు చేసేందుకు అనువైన వాతావరణాన్ని రూపుదిద్దేందుకుగాను రెండో అంచె నగరాలుమూడో అంచె నగరాలకు ప్రయాణించే ఉద్దేశంతో సంకల్పించిందే స్టార్ట్అప్ ఇండియా యాత్ర అనే ఒక కార్యక్రమం. స్టార్ట్ అప్ యాత్రలు గుజరాత్ఉత్తర్ ప్రదేశ్ఒడిశా రాష్ట్రాలను చుట్టడం పూర్తి అయింది. ఆ మూడు రాష్ట్రాలలో 18000 మంది యువ నవ పారిశ్రామికవేత్తలకు మెంటార్ షిప్ ద్వారా అండదండలను అందించడమైంది.  ఉత్తరాఖండ్ లో స్టార్ట్అప్ యాత్ర ను ఇటీవలే ఏప్రిల్ 2వ తేదీ నాడు ప్రారంభించడమైంది.  కేంపస్ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగాస్టార్ట్ అప్ ఇండియా ఇనీషియేటివ్ సంబంధిత చైతన్యాన్ని కలిగించేందుకు వర్క్ షాప్ లను దేశంలోని వివిధ ప్రాంతాలలో విద్యా సంస్థలలో నిర్వహించడం జరుగుతోంది.  జాతీయ ప్రాధాన్యం కలిగిన విద్యాసంస్థలు (ఐఐటి లు/ ఐఐఎమ్ లు/ ఎన్ఐటి లు/ ఐఐఎస్ సి )లో 8 వర్క్ షాప్ లను నిర్వహించడమైంది.

మౌలిక సదుపాయాల పరంగా తోడ్పాటు

     శాస్త్ర విజ్ఞానంసాంకేతిక విజ్ఞానంఇంజినీరింగ్ఇంకా గణిత శాస్త్రాలకు సంబంధించినటువంటి పరికరాలుసామగ్రి తో ఎంపిక చేసిన పాఠశాలల్లో 2,441 టింకరింగ్ ల్యాబ్స్ ను నెలకొల్పడం జరుగుతోంది. మీ అంతట మీరే చేయండి’ అనే స్ఫూర్తిని విద్యార్థినీ విద్యార్థులలో నింపడం ఈ కార్యక్రమం ధ్యేయం.  ఐఐటి కాన్పూర్ఐఐటి బాంబేఐఐటి ఢిల్లీఐఐటి ఖరగ్ పూర్ఐఐటి హైదరాబాద్ఐఐటి మద్రాస్ఐఐటి గువాహాటీ మరియు ఐఐఎస్ సి బెంగళూరు లలో 8 రిసర్చ్ పార్క్ లను ఏర్పాటు చేయడం జరుగుతోంది.

విద్యార్థులు నూతన ఆవిష్కారాలపై దృష్టి పెట్టే విధంగా కొన్ని కార్యక్రమాల నిర్వహణ

     నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నొవేషన్స్ (ఎన్ఐడిహెచ్ఐ.. నిధి) లో భాగంగావిద్యార్థులలో ఔత్సాహిక పారిశ్రామికవేత్త స్వభావాన్ని పెంపొందించేందుకుగాను ఒక మహా సవాలు ను తలపెట్టడం జరిగింది.  దీనికి 224దరఖాస్తులు అందాయి.  ఉచ్చతర్ ఆవిష్కార్ యోజన (యుఎవై) లో భాగంగా, 282.6 కోట్ల విలువైన 92 ప్రాజెక్టులకు ఆమోదం తెలపడమైంది. మిలియన్ మైండ్స్ ఆగ్ మెంటింగ్ నేషనల్ యాస్పిరేషన్ అండ్ నాలెడ్జ్ (ఎమ్ఎఎన్ఎకె.. మానక్) లో భాగంగానూతన ఆవిష్కరణలపరిశోధనల సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఒక అవార్డు స్కీమును ఉద్దేశించడమైంది.  ఈ పథకంలో 1 లక్ష మంది విద్యార్థులు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో పోటీ పడ్డారు.  4 ప్రాంతీయ వర్క్ షాప్ లను నిర్వహించడమైంది.  నూతన ఆవిష్కరణల వార్షిక ఉత్సవం లో 60 ఉపాయాలను చాటిచెప్పడం జరిగింది.

 

*** 



(Release ID: 1528148) Visitor Counter : 130


Read this release in: Tamil , English