మంత్రిమండలి

యుఎస్ ఎ లో టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్)కు 100 శాతం యాజమాన్య హక్కు ఉండే ‘సి’ కార్పొరేషన్ ఏర్పాటు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 21 MAR 2018 8:25PM by PIB Hyderabad

అమెరికా లో టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) కు 100 శాతం యాజమాన్యం ఉండేటటువంటి ‘సి’ కార్పొరేషన్ ను దిగువ పేర్కొన్న వివరాల ప్రకారం ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

        i.    టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) కు చెందిన ‘సి’ కార్పొరేషన్ అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం లో ఏర్పాటవుతుంది. అమెరికా లోని ఇతర రాష్ట్రాల లోనూ నమోదు చేసుకోవడంతో పాటు తదనంతరం వ్యాపారాన్ని నిర్వహించడానికి కూడా దీనికి అనుమతి ఉంటుంది.
 
     ii.   టీసీఐఎల్ ‘సి’ కార్పొరేష‌న్‌లో 100 శాతం ఈక్విటీ వాటా కింద 5 మిలియన్ల అమెరికా డాలర్ల (మారకం విలువ ను రూ.67.68 గా పరిగణిస్తూ భారత కరెన్సీలో రూ.33.84 కోట్ల) ను దశలవారీగా పెట్టుబడి పెడుతుంది.

   iii.  అమెరికా లో ప్రాజెక్టులను చేపట్టడానికి వీలుగా రుణదాతలు/సౌలభ్య సంస్థలు/విక్రేతలతో పాటు బిడ్ బాండ్లు/అడ్వాన్సులు/పనితీరు గ్యారంటీలు వగైరాల కోసం 5 మిలియన్ అమెరికన్ డాలర్ల కు సమానమైన కౌంటర్ గ్యారంటీలను టీసీఐఎల్ సమర్పించాల్సి ఉంటుంది.

ఈ కార్యకలాపాల ద్వారా ‘సి’ కార్పొరేషన్ దేశానికి అత్యంత విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతుంది. దీంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీసీఐఎల్ లాభదాయకతను పెంచుతుంది.

అమెరికా లో ప్రాజెక్టులను చేపట్టేందుకు వీలుగా ఆ దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలో ‘సి’ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది.

కొత్తగా ఏర్పాటయ్యే ‘సి’ కార్పొరేషన్ తొలి సంవత్సరాల్లో 10 మిలియన్ల అమెరికా డాలర్ల వార్షిక వ్యాపార పరిమాణం (టర్నోవర్)తో సుమారు 10 శాతం లాభాలను ఆర్జించగలదని అంచనా. తదనంతరం చేపట్టే పనుల పరిమాణాన్ని బట్టి లాభశాతం పెరుగుతుందని భావిస్తున్నారు.

అమెరికా లో ‘సి’ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా టీసీఐఎల్ తన వ్యాపారం/టర్నోవర్/లాభాలను విస్తరించుకునే వీలు కలుగుతుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అంతిమంగా ప్రభుత్వానికి లాభాలలో వాటా కూడా పెరుగుతుంది.

వాటాల రూపేణా మొత్తం 5 మిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడుల కోసం నిధులను టీసీఐఎల్ తన అంతర్గత వనరుల నుండి సమీకరించుకొంటుంది. దీంతో పాటు వ్యాపార విస్తరణ సహా బిడ్ బాండ్లు/గ్యారంటీల ముందస్తు చెల్లింపు/ప్రభుత్వ సంస్థలకు పనితీరు బ్యాంకు గ్యారంటీలు/‘సి’ కార్పొరేషన్ తరఫున అంతిమ కక్షిదారుల పక్షాన అమెరికాలో ఆర్థిక సహాయం తదితరాల కోసం మరో 5 మిలియన్ అమెరికా డాలర్ల మేర టీసీఐఎల్ కౌంటర్ గ్యారంటీలను సమర్పించాల్సి ఉంటుంది. అందువల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు.

పూర్వరంగం:

వంద శాతం భారత ప్రభుత్వ రంగ సంస్థ టీసీఐఎల్ ఐఎస్ఒ- 9001:2008, ఐఎస్ఒ-14001:2004 ల ధ్రువీకరణతో అగ్రగామి సంస్థ గా ఉంది.  అంతేకాక షెడ్యూల్- ఎ, మినీరత్న కేటగిరీ కూడా కలిగివుంది. టెలి కమ్యూనికేషన్ లు, సమాచార సాంకేతిక రంగంలో ఇప్పటికే 70 దేశాలలో పలు ప్రాజెక్టులను పూర్తి చేసింది.  ఈ రెండు రంగాలలోనే కాకుండా పౌర సదుపాయాల కల్పన రంగం లోనూ సంప్రదింపుల సేవలతో పాటు ప్రారంభం నుండి పూర్తి అయ్యే దాకా ప్రాజెక్టు అమలు సేవలను కూడా అందిస్తుంది.

ఈ కంపెనీ ఏకీకృత నికరవిలువ 2017 మార్చి 31నాటికి రూ.2,433.66 కోట్లుగా, స్వతంత్ర నికర విలువ రూ.588.92 కోట్లుగా నమోదైంది.  అలాగే ఇదే తేదీ నాటికి భారత ప్రభుత్వానికి రూ.192.99 కోట్ల మేర సంచిత లాభాంశాన్ని చెల్లించింది/ప్రకటించింది.

అమెరికా లోని అన్ని నగరాలకూ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్ నెట్, కేబుల్ టీవీ సేవలను అందించేందుకు  గూగల్ సంస్థ ఏర్పాటు చేసిన ’ఫైబర్ టు ది ప్రెమైసెస్ ప్రోజెక్ట్’లో ‘గూగల్ ఫైబర్’ అన్నది భాగంగా ఉంది.  ఈ సేవలకు సంబంధించి తమ సాంకేతిక భాగస్వాములుగా గూగల్ సంస్థ కొన్ని అంతర్జాతీయ కంపెనీలను ఎంపిక చేసుకొంది. ఈ జాబితా లో మెసర్స్ ఎరిక్ సన్, మెసర్స్ మాస్ టెక్, మెసర్స్ ఎటి & టి, మెసర్స్ జోయా తదితర సంస్థలు  ఉన్నాయి.  ఇవన్నీ వాటికి దక్కిన పనులలో వివిధ కార్యకలాపాలను పలు కంపెనీలకు సబ్ కాంట్రాక్టు కు ఇచ్చాయి.  ఇందులో భాగంగా మెసర్స్ మాస్ టెక్‌ తో మెసర్స్ టెలిటెక్ సంస్థ మాస్టర్ సర్వీసు ఒప్పందం చేసుకోగా- ఆస్టిన్ (టెక్సాస్), శాన్ జోస్ (కాలిఫోర్నియా) లలో నెట్ వర్క్ విస్తరణ పనులు చేసేందుకు మెసర్స్ ఎరిక్ సన్ సంస్థ ఒప్పందం చేసుకొంది.  ఈ నేపథ్యంలో 3 ప్రాజెక్టులకు సాంకేతిక, వాణిజ్య, రవాణా సేవలను పూర్తి స్థాయిలో అందించవలసిందిగా మెసర్స్ టెలిటెక్ సంస్థ బృందం టీసీఐఎల్‌ను సంప్రదించింది.  అనంతరం 2016 ఏప్రిల్ 13 వ తేదీన  టీసీఐఎల్ తో కలసి మెసర్స్ టెలిటెక్‌ ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం పైన సంతకాలు చేసింది.  అటుపైన 2016 మే 27 వ తేదీ న సంయుక్త సహకార ఒప్పంద పత్రం పైన కూడా సంతకాలయ్యాయి.  అయితే, టీసీఐఎల్ విదేశీ కంపెనీ కాబట్టి, ప్రత్యేక పన్ను చెల్లింపుదారు సంస్థగా ‘సి’ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది.  ఈ చర్య మానవ వనరులకు అవసరమైన ఎల్-1 వీజా లను పొందడంలో తోడ్పడగలదు.


***
 



(Release ID: 1525983) Visitor Counter : 93


Read this release in: English , Tamil