మంత్రిమండలి
విదేశాల లోని భారతీయులకు సంబంధించిన ఇండియా డివెలప్‌మెంట్ ఫౌండేశన్ మూసివేతకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
21 MAR 2018 8:27PM by PIB Hyderabad
విదేశాల లోని భారతీయులకు సంబంధించిన ఇండియా డివెలప్‌మెంట్ ఫౌండేషన్ (ఐడిఎఫ్- ఒఐ) ని మూసివేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వచ్ఛ్ భారత్ అభియాన్, గంగా నది ప్రక్షాళన కు సంబంధించిన జాతీయ కార్యక్రమం వంటి ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలకు విదేశాల లోని భారతీయులు భారత ప్రభుత్వానికి చేసే చెల్లింపులను ఒక క్రమ పద్ధతి లోకి తీసుకురావడంలో మరింత సమన్వయాన్ని సాధించేందుకుగాను ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారు.
పూర్వ రంగం:
ఎ) కేంద్ర ప్రభుత్వం 2008 లో మంత్రివర్గం ఆమోదం తో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన , లాభాపేక్షలేని ట్రస్ట్ గా ఐడిఎఫ్-ఒఐ ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టు ను విదేశాల లోని దానశీలురైన భారతీయులు, భారతదేశం లోని సామాజిక, అభివృద్ధి ప్రాజెక్టు లలో పాలుపంచుకోవడానికిగాను ఏర్పాటు చేశారు.
బి) ఈ ఫౌండేశన్ 2008 డిసెంబర్ నుండి 2015 మార్చి మధ్య కాలంలో 36.08 లక్షల రూపాయలను మాత్రమే విదేశాల లోని భారతీయుల నుండి విరాళాలుగా అందుకొంది. ఐడిఎఫ్-ఒఐ పై 2015 లో సమగ్ర సమీక్షను నిర్వహించారు. భారత ప్రభుత్వ ఫ్లాగ్ శిప్ కార్యక్రమాలైన నేషనల్ మిశన్ ఫర్ క్లీన్ గంగ, స్వచ్ఛ్ భారత్ అభియాన్ లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ఇతర సామాజిక, అభివృద్ధి ప్రాజెక్టు లను కూడా ఈ ఐడిఎఫ్-ఒఐ లో చేర్చారు.
సి) ఈ ట్రస్ట్ 2015 ఏప్రిల్ - 2018 మార్చి మధ్య 10.16 కోట్ల రూపాయలను అందుకొన్నప్పటికీ, ఇందులో ఎక్కువ విరాళాలు నేశనల్ మిశన్ ఫర్ క్లీన్ గంగ పథకానికి లేదా స్వచ్ఛ్ భారత్ మిశన్ కు సంబంధించనవే. ఈ పథకాలకు వేరు వేరుగా పాలనా సంస్థలు ఉన్నాయి. మరింత సమన్వయాన్నిపెంపొందించడానికి, ఒకే పనిని వివిధ విభాగాలు చేపట్టకుండా చూసేందుకు, సామర్ధ్యం పెంపు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఐడిఎఫ్-ఒఐ 9 వ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం, ట్రస్టు ను 2018 మార్చి నెల 31 వ తేదీ కల్లా మూసివేయాలని నిర్ణయించింది.
***
(Release ID: 1525978)