ప్రధాన మంత్రి కార్యాలయం

రేపు ‘‘ది ఢిల్లీ ఎండ్ టిబి స‌మిట్’’ ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

టిబి ఫ్రీ ఇండియా ప్ర‌చారం కూడా ప్రారంభం కానుంది

Posted On: 12 MAR 2018 2:23PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు రాజ‌ధాని న‌గ‌రంలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో ‘‘ది ఢిల్లీ ఎండ్ టిబి స‌మిట్‌’’ ను ప్రారంభించ‌నున్నారు.  ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నానికి ఆరోగ్యం, మ‌రియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డ‌బ్ల్యుహెచ్ఒ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కార్యాల‌యం (ఎస్ఇఎఆర్ఒ)ల‌తో పాటు స్టాప్ టిబి పార్ట్‌న‌ర్‌శిప్ లు స‌హ ఆతిథ్యాన్ని అందించ‌నున్నాయి.

క్ష‌యవ్యాధికి తావు లేని భార‌త‌దేశం ప్ర‌చార ఉద్య‌మాన్ని ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా ప్రారంభిస్తారు.  క్ష‌యవ్యాధి నిర్మూల‌న‌కు ఉద్దేశించిన జాతీయ వ్యూహాత్మ‌క ప్ర‌ణాళికను టిబి ఫ్రీ ఇండియా ప్ర‌చారం ఒక ఉద్య‌మ స్థాయిలో ముందుకు తీసుకు పోతుంది.  ప్ర‌తి క్ష‌యవ్యాధి రోగికి నాణ్య‌మైన రోగ నిర్ణ‌యం, చికిత్స‌ మరియు మ‌ద్ద‌తు ల‌భించేటట్టు చూడ‌డానికి రానున్న మూడు సంవ‌త్స‌రాల‌లో క్ష‌యవ్యాధి నిర్మూల‌న‌కు ఉద్దేశించిన జాతీయ వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక (ఎన్ఎస్ పి)కి 12,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.  నూత‌న‌ ఎన్ఎస్‌పి ఒక బ‌హుముఖ విధానాన్ని అవ‌లంబిస్తుంది.  ఈ బహుముఖ విధానం ప్రైవేటు ప్రొవైడర్ల నుండి సంరక్షణను పొందగోరుతున్న టిబి రోగులు మరియు రోగనిర్ణయానికి నోచుకోని అధిక స్థాయి ముప్పును కలిగివున్న టిబి రోగులతో సహా యావత్తు టిబి రోగులను ‘గుర్తిస్తుంది’.
 
సవరించిన జాతీయ క్ష‌యవ్యాధి కార్య‌క్ర‌మం 1997లో అమలులోకి వచ్చినప్పటి నుండి ముమ్మర కృషి ద్వారా 2 కోట్ల‌ మందికి పైగా రోగులకు చికిత్స అందించడం జరిగింది.  ఎస్‌డిజి యొక్క నిర్దేశిత అవ‌ధికి అయిదు సంవ‌త్స‌రాలు ముందుగానే, అంటే 2025 క‌ల్లా, క్ష‌య వ్యాధిని అంత‌మొందించాల‌న్న‌ది ప్ర‌ధాన మంత్రి యొక్క విజ‌న్ గా ఉంది.   


***



(Release ID: 1523859) Visitor Counter : 83