PIB Headquarters

సి-ఎమ్ఇటి వార్షిక స్థాప‌న దినోత్స‌వాల‌ను ప్రారంభించిన శ్రీ ఆర్‌. చిదంబ‌రం

Posted On: 08 MAR 2018 6:35PM by PIB Hyderabad

హైద‌రాబాద్ లో ఈ రోజు సెంట‌ర్ ఫ‌ర్ మెటీరియ‌ల్స్ ఫ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ టెక్నాల‌జీ (సి-ఎమ్ఇటి) మ‌రియు ఇంట‌ర్నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆన్ అడ్వాన్స్‌డ్ సెమీ-కండ‌క్ట‌ర్ మెటీరియ‌ల్స్ అండ్ డివైసెస్ (ఐసిఎఎస్ఎమ్‌డి-2018) ల యొక్క 28వ వార్షిక స్థాప‌క దినోత్స‌వాల‌ను భార‌త ప్ర‌భుత్వ ప్రిన్సిప‌ల్ సైంటిఫిక్ అడ్వైజ‌ర్ శ్రీ ఆర్. చిదంబ‌రం ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన ఒక స‌మావేశాన్ని ఉద్దేశించి శ్రీ ఆర్‌. చిదంబ‌రం ప్ర‌సంగిస్తూఅప్లైడ్‌ రిస‌ర్చ్ కు బేసిక్ రిస‌ర్చ్ ను ముడిపెట్ట‌డానికి ప్రాముఖ్యం ఇవ్వాల‌ని నొక్కి చెప్పారు.  అలాగేమెటీరియ‌ల్స్ రిస‌ర్చ్ ఇన్ ఎల‌క్ట్రానిక్స్ టెక్నాల‌జీ కి ఎంతో ప్రాధాన్యం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. సిలికాన్ కార్బైడ్‌గాలియం నైట్రేట్ లాంటి ప‌దార్ధాల వినియోగంతో ప్ర‌జ‌ల‌కు వైద్యంవిద్య లాంటి రంగాల‌లో ఉప‌యోగ‌ప‌డే పరికరాలనుత‌క్కువ ఖ‌ర్చుతో రూపొందే ప‌రిక‌రాల‌ను మ‌రింత‌గా అభివృద్ధి చేయాల‌ని చిదంబ‌రం సూచించారు.  వివిధ శాస్త్రీయ ప‌రిక‌రాల‌లో సెన్స‌ర్ లుకండ‌క్ట‌ర్ ల వినియోగం పెరుగుతున్న నేప‌థ్యంలో ఆధునిక వినియోగం ఉండే సెమి- కండ‌క్ట‌ర్ నెట్ వ‌ర్క్ అభివృద్ధిని సి-ఎమ్ఇటి చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు.  బ‌ల‌మైన ఇ-వేస్ట్ ప‌రిజ్ఞానాల విధానం ఉండాల‌ని చెప్తూ, 2020 కల్లా దేశంలో వాడిన వాహ‌నాల నుంచి మాత్ర‌మే 180 ట‌న్నుల అల్యూమినియం ఉత్ప‌త్తి అవుతుంద‌నిదీనిని రీ మెల్ట్ చేయ‌డం ద్వారాస‌హ‌జంగా అయ్యే ఇంధ‌న వినియోగంలో 7 శాతమే ఖ‌ర్చు అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

ర‌క్ష‌ణ మంత్రి స‌ల‌హాదారు శ్రీ సతీశ్ రెడ్డి మాట్లాడుతూ దేశ భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు ప‌నికి వ‌చ్చే ప‌రిజ్ఞానాల‌ను గుర్తించాల‌ని శాస్త్రవేత్త‌ల‌కు సూచించారు.  ఆ దిశ‌గా ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని వాటి సాధ‌న కోసం ప‌రిజ్ఞానాల‌ను రూపొందించాల‌నిఅది జరిగినప్పుడే దేశీయ అవ‌స‌రాల‌కు  ప‌రిజ్ఞానాల‌నుప‌రిక‌రాల‌ను భార‌తదేశం స్వ‌తంత్రంగా  స‌మ‌కూర్చుకోగ‌ల‌ద‌ని పేర్కొన్నారు.

        ఈ సమావేశంలో సి-ఎమ్ఇటి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్.ఆర్. మునిరత్నంఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్సి-ఎమ్ఇటి డైరెక్టర్ డాక్టర్ ఆర్. ర‌తీశ్‌ఇంట‌ర్నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆన్ అడ్వాన్స్‌డ్ సెమి-కండ‌క్ట‌ర్ మెటీరియ‌ల్స్ అండ్ డివైసెస్ (ఐసిఎఎస్ఎమ్‌డి-2018) కన్వీనర్ డాక్టర్ డి.ఎస్‌. ప్ర‌సాద్, ఇంకా  వివిధ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

***



(Release ID: 1523360) Visitor Counter : 139


Read this release in: English