మంత్రిమండలి

అక్రమ వినియోగం, మాదక ద్రవ్యాలు, మనసుమీద ప్రభావం చూపే పదార్ధాలు, రసాయనిక పదార్ధాల అక్రమ రవాణా వంటి నేరాలను రికట్టేందుకు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక ఒప్పందాన్ని మంత్రిమండలి ఆమోదించింది.

Posted On: 07 MAR 2018 7:23PM by PIB Hyderabad

అక్రమ వినియోగం, మాదక ద్రవ్యాలు, మనసుమీద ప్రభావం చూపే పదార్ధాలు, రసాయనిక పదార్ధాల అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టేందుకు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక ఒప్పందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 

రెండు దేశాల మధ్య - అక్రమ వినియోగం, మాదక ద్రవ్యాలు, మనసుమీద ప్రభావం చూపే పదార్ధాలు, రసాయనిక పదార్ధాల అక్రమ రవాణా వంటి నేరాలను - సమాచార మార్పిడి, నైపుణ్యం, సామర్ధ్య నిర్మాణం ద్వారా అరికట్టేందుకు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ ఒప్పందాన్ని ఉద్దేశించారు.   తీవ్రవాదులకు అక్రమంగా అందుతున్న ఆర్ధిక సహాయాన్ని అందజేసే మార్గాలకు అంతరాయం కలిగించడంతో పాటు సమర్ధవంతమైన సంస్థాగత సంప్రదింపులను ప్రోత్సహించి, బహుళజాతి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఈ ఒప్పందం ద్వారా అరికట్టాలని కూడా యోచిస్తున్నారు. 


***


(Release ID: 1523221)
Read this release in: English , Assamese , Gujarati , Tamil