మంత్రిమండలి

మేజ‌ర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు, 2016 లో మార్పుల‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 07 FEB 2018 8:12PM by PIB Hyderabad


 పార్ల‌మెంటులో పెండింగులో ఉన్న మేజ‌ర్ పోర్ట్ అథారిటీల బిల్లు, 2016 లో ఆధికారిక స‌వ‌ర‌ణ‌లను నమోదు చేసేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఆ శాఖ‌కు సంబంధించిన పార్ల‌మెంట‌రీ స్థాయీ సంఘం సిఫార‌సులు ఈ స‌వ‌ర‌ణ‌లకు ఆధారంగా ఉన్నాయి.

ఈ దిగువ పేర్కొన్న మార్పులను బిల్లులో పొందుప‌రుస్తున్నారు:

(i)    పోర్ట్ అథారిటీ బోర్డు కు ప్ర‌స్తుత ఉద్యోగుల నుండి నియ‌మించే కార్మిక ప్ర‌తినిధుల ను ఒక్కరి నుండి ఇద్దరికి పెంచడమైంది.
   
(ii)    ఉద్యోగుల ప్ర‌తినిధిగా నియ‌మితుడైన స‌భ్యుని కాల‌ప‌రిమితి మూడు సంవ‌త్స‌రాలు.  ఒక్కొక్క స‌భ్యుడు రెండు విడ‌త‌ల‌కు మించి స‌భ్య‌త్వాన్ని పొందేందుకు అర్హ‌త ఉండ‌దు.  అత‌డి పదవీవిరమణ తో కూడా బోర్డు స‌భ్య‌త్వం ముడిప‌డి ఉంటుంది.

(iii)    పోర్ట్ అథారిటీ బోర్డు లోని స్వ‌తంత్ర స‌భ్యుల సంఖ్య క‌నీసం రెండు, గ‌రిష్ఠంగా నాలుగు ఉండాలి.

(iv)    మేజ‌ర్ పోర్ట్ ట్ర‌స్టు చ‌ట్టం, 1963 లో భాగంగా బోర్డ్ ఆఫ్ ట్ర‌స్టీస్ లోని ప్ర‌తి ఒక్క స‌భ్యుడు పదవీవిరమణ ప్ర‌యోజ‌నాలు ఏవైనా అందుకుంటూ ఉండి ఉంటే, బోర్డు నుండి ఆ ప్ర‌యోజ‌నాల‌ను అత‌నికి కొన‌సాగించ‌వ‌చ్చు.  

(v)    మేజ‌ర్‌ పోర్ట్ ప‌రిధి లోని ప్రాంతాలలో ఏవైనా అభివృద్ధి ప‌నులు, లేదా మౌలిక వ‌స‌తుల నిర్మాణం చేప‌ట్ట‌డానికి మాస్ట‌ర్ ప్లాను ను రూపొందించేందుకు, అందుకు అనుగుణంగా భూమిని వినియోగించుకొనేందుకు బోర్డు కు అధికారం ఉంటుంది.  అటువంటి మాస్ట‌ర్ ప్లాను ను రాష్ర్ట‌ ప్ర‌భుత్వ సంస్థ‌లు లేదా ఏ ప్ర‌భుత్వ అధీకృత  సంస్థ అనుమ‌తికి లోబ‌డాల్సిన ప‌ని లేకుండా స్వ‌తంత్రంగా అమ‌లుప‌ర‌చ‌వ‌చ్చు.

(vi)    చ‌ట్టం ఆచ‌ర‌ణలోకి వచ్చిన‌ప్ప‌టి నుండి పిపిపి ప్రాజెక్టుల విష‌యంలో మార్కెట్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా టారిఫ్‌ ను నిర్ణ‌యించుకొనే  స్వేచ్ఛ క‌న్సెశనేయర్ కు ఉంటుంది.

(vii)    ఈ చ‌ట్టం ప‌రిధిలో బోర్డుకు అందే సొమ్ముల‌న్నింటినీ భారత ప్రభుత్వ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా అప్ప‌టికే తెరచిన ఏదైనా సార్వ‌త్రిక ఖాతాలో, పోర్టు ఖాతాలో, లేదా ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంకు లో జ‌మ‌ చేయవలసి ఉంటుంది.
 
(viii)    ఎంపిక సంఘం సిఫార‌సుల ఆధారంగా అజూడికేట‌రీ బోర్డు కు ప్రిసైడింగ్ అధికారిని, స‌భ్యుల‌ను కేంద్ర‌ ప్ర‌భుత్వం నియ‌మిస్తుంది.
 
(ix)    నిర్దేశిత విధివిధానాల‌కు లోబ‌డి ప్రిసైడింగ్ అధికారిని, లేదా స‌భ్యులలో ఎవ‌రినైనా తొల‌గించే అధికారం కేంద్ర‌ ప్ర‌భుత్వానికి ఉంటుంది.

(x)    బొంబాయి పోర్ట్ ట్ర‌స్ట్ చ‌ట్టం, 1879 మరియు క‌ల‌క‌త్తా పోర్ట్ ట్ర‌స్ట్ చ‌ట్టం, 1890లోని నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ముంబయి, కోల్ కతా పోర్టు లు ఆస్తుల మ‌దింపున‌కు సంబంధించి పుర‌పాల‌క సంస్థ‌ల నుండి ఏవైనా ప్ర‌యోజ‌నాలను పొందుతూ ఉంటే అవి కొన‌సాగేటట్టు సేవింగ్ క్లాజు లో మార్పులు చేస్తారు.


***



(Release ID: 1519977) Visitor Counter : 68


Read this release in: English , Tamil