వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కీలక రంగాలలో ఎఫ్ డిఐ విధానం మరింత సరళతరం ఎఫ్ డిఐ విధానంలో సవరణలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
ఒక బ్రాండ్ రిటైల్ వర్తకం రంగంలో ఆటోమేటిక్ రూట్ లో 100% ఎఫ్ డిఐ
నిర్మాణ రంగం అభివృద్ధి లో ఆటోమేటిక్ రూట్ లో 100% ఎఫ్ డిఐ
ఏర్ ఇండియా లో అప్రూవల్ రూట్ లో 49% వరకు పెట్టుబడి పెట్టేందుకు విదేశీ విమాన సంస్థలకు అనుమతి
పవర్ ఎక్స్ చేంజ్ లలో ప్రైమరీ మార్కెట్ ద్వారా పెట్టుబడి పెట్టేందుకు ఎఫ్ ఐఐ లు/ఎఫ్ పిఐ లకు అనుమతి
ఎఫ్ డిఐ విధానంలో ‘వైద్య సాధనాల’ నిర్వచనంలో సవరణ
Posted On:
10 JAN 2018 1:08PM by PIB Hyderabad
ఎఫ్ డిఐ విధానంలో అనేక సవరణలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవి దేశంలో సులువుగా వ్యాపారం చేసేటట్టుగా ఎఫ్ డిఐ విధానాన్ని మరింత ఉదారంగాను, సరళతరంగాను మార్చడానికి ఉద్దేశించినవి. ఫలితంగా దేశంలో ఎఫ్ డిఐ ప్రవాహాలు పెరిగి పెట్టుబడులు, ఆదాయం మరియు ఉద్యోగకల్పన వర్థిల్లేందుకు తోడ్పాటు లభిస్తుంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డిఐ) అనేది దేశంలో ఆర్థికాభివృద్ధి కోసం రుణేతర ఆర్థిక సహాయానికి ఒక మార్గంగాను మరియు ఆర్థిక వృద్ధికి ఒక ప్రధానమైనటువంటి చోదక శక్తిగాను ఉంది. ప్రభుత్వం ఎఫ్ డిఐ పరంగా పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి ఓ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పలు రంగాలు/కార్యకలాపాలలో 100% దాకా ఎఫ్ డిఐ ని ఆటోమేటిక్ రూట్ లో అనుమతించడం జరుగుతోంది. ఇటీవల కొంత కాలంగా, అనేక రంగాలలో ఎఫ్ డిఐ విధాన సంబంధ సంస్కరణలను తీసుకురావడమైంది. ఈ రంగాలలో రక్షణ, నిర్మాణ రంగ వికాసం, బీమా, పింఛన్, ఇతర ఆర్థిక సేవలు, అసెట్ రికన్ స్ట్రక్షన్ కంపెనీలు, ప్రసారాలు, పౌర విమానయానం, ఔషధాలు, ట్రేడింగ్ ల వంటివి ఉన్నాయి.
ప్రభుత్వం తీసుకొన్న చర్యలతో దేశంలోకి తరలివచ్చిన ఎఫ్ డిఐ ప్రవాలు అధికమయ్యాయి. 2013-14 లో 36.05 బిలియన్ యుఎస్ డాలర్లుగా ఉన్న మొత్తం ఎఫ్ డిఐ ప్రవాహాలు, 2014-15 సంవత్సర కాలంలో 45.15 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరాయి. 2015-16 లో మొత్తం 55.46 బిలియన్ యుఎస్ డాలర్ల ఎఫ్ డిఐ ని దేశం అందుకొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తంమీద ఎఫ్ డిఐ ప్రవాహాలు 60.08 బిలియన్ యుఎస్ డాలర్ల మేరకు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఎఫ్ డిఐ ప్రవాహాలు నమోదు కావడం ఇంతకు ముందు ఎన్నడూ లేదు.
దేశానికి ఇతోధికంగా విదేశీ పెట్టుబడిని ఆకర్షించగల సామర్థ్యం ఉందని, ఎఫ్ డిఐ విధానాన్ని మరింత ఉదారంగాను మరియు సరళతరంగాను మార్చడం వల్ల ఇది సాధ్యపడగలదన్న అభిప్రాయం వ్యక్తం అయింది. దీనికి అనుగుణంగానే ఎఫ్ డిఐ విధానంలో పలు సవరణలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు:
I. సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ (ఎస్ బిఆర్ టి) లో ఎఫ్ డిఐ కి ఇక ప్రభుత్వ ఆమోదం అవసరం ఉండదు.
II. ఎస్ బిఆర్ టి సంబంధిత వర్తమాన ఎఫ్ డిఐ విధానం 49% ఎఫ్ డిఐ ని ఆటోమేటిక్ రూట్ లో అనుమతిస్తోంది. అలాగే 49% కన్నా మించిన ఎఫ్ డిఐ ని మరియు 100% వరకు ఎఫ్ డిఐ ని గవర్నమెంట్ అప్రూవల్ రూట్ గుండా అనుమతిస్తోంది. ఇప్పుడు సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ లో 100% ఎఫ్ డిఐ ని ఆటోమేటిక్ రూట్ లో అనుమతించాలని నిర్ణయించడమైంది. సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ ఎన్ టిటి ని మొదటి 5 సంవత్సరాలలో దాని గ్లోబల్ కార్యకలాపాలకు గాను భారతదేశం నుండి వస్తువులను సమకూర్చుకొనే ప్రక్రియ (సోర్సింగ్) ను క్రమానుగతంగా పెంచుకొనేందుకు అనుమతించాలన్న నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ అవధి- భారతదేశం నుండి 30 శాతం కొనుగోళ్లు చేయడం అనివార్యంగా ఉన్నటువంటి అవసరంతో పోల్చి చూస్తే- ఒకటో స్టోర్ ను తెరచిన సంవత్సరంలోని ఏప్రిల్ 1వ తేదీ నుండి మొదలవుతుంది. దీనిలోని ఉద్దేశం, సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ కార్యకలాపాలు జరిపే నాన్- రెసిడెంట్ ఎన్ టిటి ల ద్వారా వెనుకటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏదైనా ఫలానా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒకే బ్రాండ్ (భారతీయ రూపాయలలో) కోసం భారతదేశం నుండి జరిపిన ఈ తరహా గ్లోబల్ సోర్సింగ్ యొక్క విలువలో వృద్ధి చోటు చేసుకోవాలన్నదే. ఈ విధమైన సోర్సింగ్ నేరుగా గాని లేదా వాటి గ్రూపు కంపెనీల ద్వారా గాని చేసేందుకు వీలు ఉంటుంది. అయిదు సంవత్సరాల పాటు ఉండేటటువంటి ఈ అవధి పూర్తి అయిన తరువాత ఎస్ బిఆర్ టి ఎన్ టిటి కి ప్రతి సంవత్సరం నేరుగా తన భారతీయ కార్యకలాపాల కోసం 30 శాతం సోర్సింగ్ తో ముడి పెట్టిన కొలమానాలను పూర్తి చేయడం అనివార్యమవుతుంది.
III. నాన్- రెసిడెంట్ ఎన్ టిటి లు లేదా ఎన్ టిటి లు, అవి బ్రాండ్ యొక్క యజమానులు గాని లేదా మరేదైనా హోదాను కలిగివున్నప్పటికీ, వాటికి విశిష్ట బ్రాండ్ కోసం దేశంలో ‘ఒకే బ్రాండ్’ తరహా ఉత్పత్తి యొక్క రిటైల్ ట్రేడింగ్ కు గాను అనుమతిని ఇవ్వడమైంది. ఈ రిటైల్ ట్రేడింగ్ కార్యకలాపాలను- నేరుగా బ్రాండ్ యజమాని గాని లేదా ఒకే బ్రాండ్ యొక్క రిటైల్ ట్రేడింగ్ కార్యకలాపాలను నిర్వహించే భారతీయ ఎన్ టిటి మరియు బ్రాండ్ యజమానికి మధ్య కుదిరినటువంటి చట్టబద్ధమైనటువంటి తర్కబద్ధ ఒప్పందం ద్వారా గాని- చేయవచ్చు.
పౌర విమానయానం:
ప్రస్తుతమున్న నియమాల ప్రకారం, విదేశీ ఏర్ లైన్స్ కు షెడ్యూల్డు మరియు నాన్- షెడ్యూల్డు ఏర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసులను నడుపుతున్నటువంటి భారతీయ కంపెనీల యొక్క మూలధనంలో వాటి చెల్లించిన (పెయిడ్- అప్) మూలధనంలో 49% పరిమితి వరకు ప్రభుత్వ ఆటోమేటిక్ రూట్ కింద పెట్టుబడి పెట్టేటందుకు అనుమతిస్తారు. అయితే ఈ నిబంధన ప్రస్తుతం ఏర్ ఇండియా కు వర్తించడం లేదు. దీనికి అర్థం ఏమిటంటే, ఏర్ ఇండియా లో విదేశీ ఏర్ లైన్స్ పెట్టుబడి పెట్టడానికి వీలు లేదు అని. ఈ పరిమితిని తొలగించాలని మరియు దిగువన పేర్కొన్న షరతులకు లోబడి ఏర్ ఇండియా లో 49% వరకు పెట్టుబడిని అప్రూవల్ రూట్ ద్వారా పెట్టేందుకు విదేశీ ఏర్ లైన్స్ ను అనుమతించాలని ఇప్పుడు నిర్ణయించడమైంది:
I. ఏర్ ఇండియా లో విదేశీ పెట్టుబడి (పెట్టుబడులు)- విదేశీ ఏర్ లైన్స్ తో కూడా కలుపుకొని- నేరుగా గాని లేదా పరోక్షంగా గాని 49 % మించకూడదు.
II. ఏర్ ఇండియా యొక్క గణనీయ యాజమాన్యం మరియు ప్రభావశీల నియంత్రణ ఇకముందు కూడా భారతీయుల చేతిలోనే ఉండాలి.
నిర్మాణ రంగ వికాసం: టౌన్ షిప్ లు, గృహ నిర్మాణం, నిర్మాణం పూర్తి అయినటువంటి మౌలిక సదుపాయాలు మరియు రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ సర్వీసులు
రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ సర్వీసు అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కిందకు రాదని వివరించాలని, ఈ కారణంగా ఇది ఆటోమేటిక్ రూల్ లో భాగంగా 100% ఎఫ్ డిఐ కి అర్హమైతుందని నిర్ణయించడమైంది.
పవర్ ఎక్స్ చేంజీలు:
ప్రస్తుతమున్న నియమాల ప్రకారం, 2010 నాటి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (పవర్ మార్కెట్) రెగ్యులేశన్స్ ప్రకారం నమోదైన పవర్ ఎక్స్ చేంజీలలో 49% ఎఫ్ డిఐ కి ఆటోమేటిక్ రూట్ లో అనుమతి ఉన్నది. అయితే ఎఫ్ఐఐ/ ఎఫ్ పిఐ కొనుగోళ్లను సెకండరీ మార్కెటు కు మాత్రమే పరిమితం చేశారు. ఈ నిబంధన ను తొలగించాలని, ఇలా చేయడం వల్ల ఎఫ్ఐఐ/ ఎఫ్ పిఐ లు ప్రైమరీ మార్కెట్ ద్వారా కూడా పవర్ ఎక్స్ చేంజీలలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని ఇప్పుడు నిర్ణయించడమైంది.
ఎఫ్ డిఐ విధానంలో భాగంగా ఉండే అనుమతికి సంబంధించినటువంటి ఇతర ఆవశ్యకతలు :
I. వర్తమాన ఎఫ్ డిఐ విధానం ప్రకారం, స్థాపనకు పూర్వపు ఖర్చుల వంటి నగదేతర ప్రాతిపదికల ద్వారా ఈక్విటీ షేర్ల జారీ, యంత్రపరికరాల దిగుమతి వంటి వాటిని ప్రభుత్వ ఆమోదం రూట్ లో అనుమతించడం జరుగుతుంది. ఇప్పుడు వీటిని ఆటోమేటిక్ రూట్ పరిధిలో ఉన్న రంగాల విషయంలో ఆటోమేటిక్ రూట్ లోనే అనుమతించాలని నిర్ణయించడమైంది.
వేరే భారతీయ కంపెనీ/కంపెనీలు/ ఎల్ ఎల్ పి యొక్క మూలధనంలో పెట్టుబడి పెట్టే కార్యకలాపంలో నిమగ్నమైన ఓ భారతీయ కంపెనీలో మరియు కోర్ ఇన్ వెస్టింగ్ కంపెనీలలోకి విదేశీ పెట్టుబడి
ని ప్రస్తుతం 100 % వరకు ప్రభుత్వ ముందస్తు ఆమోదంతో అనుమతిస్తున్నారు. ఈ రంగాలలో ఎఫ్ డిఐ విధానాన్ని ఇతర ఆర్థిక సేవల సంబంధిత ఎఫ్ డిఐ విధానం నియమాలతో సమం చేయాలని ఇప్పుడు నిర్ణయించడమైంది. ఈ విధంగా, పైన పేర్కొన్న కార్యకలాపాలు ఏదైనా ఆర్థిక రంగ నియంత్రణదారు ద్వారా నియంత్రణలో ఉన్నట్లయితే గనక, అప్పుడు 100 % వరకు విదేశీ పెట్టుబడిని ఆటోమేటిక్ రూట్ లో అనుమతిస్తారు; మరియు, అవి గనుక ఏ ఆర్థిక రంగ నియంత్రణదారు ద్వారా నియంత్రించబడకపోతున్నట్లయితే లేదా కేవలం పాక్షికంగా మాత్రమే నియంత్రించబడుతున్నట్లయితే లేదా నియంత్రణదారు పర్యవేక్షణ పరంగా ఏదైనా సందేహం ఉన్నట్లయితే, 100 % వరకు విదేశీ పెట్టుబడిని గవర్నమెంట్ అప్రూవల్ రూట్ లో అనుమతిస్తారు. అయితే దీనికి ప్రభుత్వం నిర్ణయించే మేరకు కనీస మూలధన అవసరాల వంటి కొన్ని షరతులు ఉంటాయి.
ఆందోళనకారక దేశాల నుండి వచ్చే ఎఫ్ డిఐ ప్రతిపాదనలను పరిశీలించేందుకు సమర్ధాధికార సంస్థ:
ప్రస్తుతం అమలవుతున్న ప్రక్రియల ప్రకారం, కంట్రీస్ ఆఫ్ కన్ సర్న్ నుండి వచ్చే పెట్టుబడులకు సంబంధించిన ఎఫ్ డిఐ దరఖాస్తులు, వేటికోసమైతే ఫెమా 20, ఎఫ్ డిఐ విధానం మరియు భద్రతపరమైన మార్గదర్శక సూత్రాలు అవసరమవుతాయో, ఎప్పటికప్పుడు సవరణకు లోనవుతుంటాయో, వాటిని ఆటోమేటిక్ రూట్ పరిధి కిందకు వచ్చే రంగాలు/కార్యకలాపాలలో పెట్టుబడులను హోం మంత్రిత్వ శాఖ ప్రాసెస్ చేస్తుంది. కాగా, గవర్నమెంట్ అప్రూవల్ రూట్ పరిధి కిందకు వచ్చే రంగాలు/కార్యకలాపాలకు సంబంధించి భద్రతపరమైన అనుమతి అవసరమైన కేసులను ఆయా పాలక మంత్రిత్వ శాఖలు/విభాగాలు కేసు వారీగా ప్రాసెస్ చేస్తాయి. ఇప్పుడు నిర్ణయించిందేమిటంటే, కంట్రీ ఆఫ్ కన్ సర్న్ నుండి వచ్చే పెట్టుబడి విషయంలో మాత్రమే ఆమోదం అవసరమైన ఆటోమేటిక రూట్ సెక్టర్ లలో పెట్టుబడుల కోసం, ఎఫ్ డిఐ దరఖాస్తులను డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలిసి & ప్రమోషన్ (డిఐపిపి) ప్రాసెస్ చేస్తుంది. కంట్రీస్ ఆఫ్ కన్ సర్న్ కు సంబంధించిన భద్రతపరమైన అనుమతి సైతం అవసరమయ్యే గవర్నమెంట్ అప్రూవల్ రూట్ పరిధిలోని కేసులను సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంటే/విభాగమే ప్రాసెస్ చేస్తుంటుంది.
ఔషధాలు:
ఔషధ రంగంతో ముడిపడిన ఎఫ్ డిఐ విధానం లో- ఇతర విషయాలతో పాటు- వైద్య సంబంధిత పరికరానికిచ్చినటువంటి నిర్వచనం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్టు లోని సవరణల కు లోబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విధానంలో ప్రస్తావించిన నిర్వచనం తనంత తాను పూర్ణంగా ఉన్నందువల్ల, దీనిలోని డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్టు ప్రసక్తిని తీసివేయాలని నిర్ణయించడమైంది. దీనికి తోడు, ఎఫ్ డిఐ విధానం లో పొందుపరచిన ‘వైద్య సంబంధ పరికరాల’ యొక్క నిర్వచనాన్ని సవరించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఆడిట్ సంస్థల కు సంబంధించిన ఆంక్షాపూర్వక షరతుల నిషేధం:
విదేశీ పెట్టుబడులను అందుకొనే భారతీయ ఇన్ వెస్టీ కంపెనీలు నియమించుకొనే ఆడిటర్ల విషయంలో ప్రత్యేక వివరణల కు సంబంధించి ఎటువంటి నిబంధనలూ ప్రస్తుతం అమలవుతున్న ఎఫ్ డిఐ విధానం లో లేవు. ఏ విదేశీ పెట్టుబడిదారు అయినా ఇండియన్ ఇన్ వెస్టీ కంపెనీ అంతర్జాతీయ నెట్ వర్క్ ను కలిగివున్న ఫలానా ఆడిటర్/ఆడిట్ సంస్థ ను పెట్టుకోవాలని సూచించగోరిన సందర్భాలలో, సదరు ఇన్ వెస్టీ కంపెనీల ఆడిట్ ను జాయింట్ ఆడిట్ గా నిర్వహించాలి; అయితే ఆ జాయింట్ ఆడిట్ ను నిర్వహించే ఆడిటర్లలో ఒక ఆడిటర్ అదే నెట్ వర్క్ లో భాగం అయివుండకూడదు.
***
(Release ID: 1516297)
Visitor Counter : 170