మంత్రిమండలి
శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞాన రంగంలో సహకారానికి భారతదేశం మరియు కెనడా ల మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
10 JAN 2018 1:13PM by PIB Hyderabad
శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞాన రంగంలో సహకారానికి గాను కెనడా తో ఒక అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఎమ్ఒయు భారతదేశంలో మరియు కెనడా లో పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) సంస్థలకు, విద్యా సంస్థలకు మధ్య శాస్త్ర సంబంధ సహకారాన్ని పెంపొందించడానికి ఒక యంత్రాంగాన్ని సమకూర్చి, తద్వారా తోడ్పాటును అందిస్తుంది.
ముఖ్యాంశాలు:
• కెనడా కు చెందిన నేచురల్ సైన్సెస్ అండ్ ఇంజినీయరింగ్ రీసర్చ్ కౌన్సిల్ (ఎన్ఎస్ఇఆర్ సి) తో శాస్త్ర విజ్ఞాన మరియు సాంకేతిక విజ్ఞాన విభాగం కుదుర్చుకొన్న ఒక ఎమ్ఒయు లో భాగంగా భారతదేశం, కెనడా ల మధ్య పరిశోధన మరియు అభివృద్ధి సంబంధిత సహకారానికి గాను ఒక వినూత్నమైన నమూనా ను ఆచరణ లోకి తీసుకువస్తారు.
• ఈ ఎమ్ఒయు లో భాగంగా భారతదేశం, కెనడా లలో బహుళ విభాగాలలో పరిశోధన సంబంధిత భాగస్వామ్యాలను ప్రోత్సహించడం కోసం ఇండియా-కెనడా సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ మల్టీ డిసిప్లినరీ పార్ట్‌నర్ శిప్ టు అక్సలరేట్ కమ్యూనిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ సస్‌టైనబిలిటి (ఐసి-ఐఎమ్‌పిఎసిటిఎస్) కార్యక్రమానికి మద్దతును అందిస్తారు.
• శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞానం అండదండలతో పరిష్కార మార్గాలను సూచించడం ద్వారా పరిశోధన మరియు అభివృద్ధి పథకాలు సామాజిక పరివర్తనను వేగవంతం చేయడం పైన దృష్టిని సారిస్తాయి.
• ఇందులో భాగం పంచుకొనే వాటిలో భారతదేశం మరియు కెనడా లకు చెందిన శాస్త్ర విజ్ఞాన సంస్థలు, విద్యా సంస్థలతో పాటు పరిశోధన మరియు అభివృద్ధి సంబంధిత ప్రయోగశాలలు కూడా ఉంటాయి.
• పరస్పర సహకారానికి గాను గుర్తించిన రంగాలలో భద్రమైన మరియు స్థిరమైన మౌలిక సదుపాయాలు, సమగ్ర జల నిర్వహణ వంటివి ఉంటాయి.
• ఇది భారతదేశానికి మరియు కెనడాకు చెందిన శాస్త్ర విజ్ఞాన సంస్థలు, శాస్త్రవేత్తలు మరియు ప్రత్యేక నిపుణుల మధ్య సంబంధాలను ఏర్పాటు చేసి వాటిని బలపరచడానికి, అంతేకాకుండా సంస్థాగత నెట్ వర్క్ ను అభివృద్ధి పరచడానికి సాయపడుతుంది.
పూర్వరంగం:
2005 నవంబర్ లో భారతదేశం మరియు కెనడా ల మధ్య కుదిరిన శాస్త్ర విజ్ఞాన మరియు సాంకేతిక విజ్ఞాన సహకార పూర్వక అంతర్ ప్రభుత్వ ఒప్పందానికి తరువాయిగా ఈ ఎమ్ఒయు ను కుదుర్చుకోవడమైంది.
*****
(Release ID: 1516260)
Visitor Counter : 178