మంత్రిమండలి

తుంగ‌భ‌ద్ర స్టీల్ ప్రోడ‌క్ట్ స్ లిమిటెడ్ ను మూసివేయడానికి సంబంధించి సిసిఇఎ తీసుకొన్న నిర్ణ‌యాన్ని అమ‌లు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 10 JAN 2018 1:11PM by PIB Hyderabad
తుంగ‌భ‌ద్ర స్టీల్ ప్రోడ‌క్ట్ స్ లిమిటెడ్ (టిఎస్‌పిఎల్‌) స్థిరాస్తుల విక్ర‌యానికి సంబంధించి ఆ కంపెనీని మూసివేసే విషయంలో సిసిఇఎ యొక్క నిర్ణ‌యాన్ని అమ‌లుపరచేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  అంతేకాక, ఇది టిఎస్‌పిఎల్ తాలూకు మిగ‌తా అప్పుల‌ను తీర్చివేసిన అనంత‌రం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుండి కంపెనీ యొక్క పేరును తొల‌గించేందుకు కూడా మార్గాన్ని సుగ‌మం చేయగలదు.

కంపెనీ యొక్క ఉద్యోగులు/శ్రామికులు మ‌రియు రుణ‌దాత‌లకు అన్ని బ‌కాయిల‌ను తీర్చివేసిన తరువాత 2015 డిసెంబ‌ర్‌లో కంపెనీ మూసివేత‌కు సిసిఇఎ ఆమోదం తెలపడం ప్రస్తావనార్హం.  20,000 చ‌ద‌ర‌పు మీట‌ర్ల భూమితో పాటు ఎమ్ఎమ్‌హెచ్‌ ప్లాంటులను కూడా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేసేందుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  అలాగే, హాస్ పేట‌ లోని కంపెనీ కి చెందిన 82.37 ఎక‌రాల భూమిని క‌ర్ణాట‌క స్టేట్ హౌసింగ్ బోర్డ్ వినియోగించుకోవడానికి గాను క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి విక్ర‌యించేందుకు కూడా మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  ఈ భూమిని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి వారు ఇవ్వ‌జూపినటువంటి ఒక్కో ఎక‌రా కు రూ. 66 ల‌క్ష‌ల ధ‌ర చొప్పున‌  విక్ర‌యిస్తున్నారు.
 

***


(Release ID: 1516258) Visitor Counter : 134


Read this release in: English , Kannada