ప్రధాన మంత్రి కార్యాలయం

ట‌ర్కీ లో జరిగిన ఎఫ్ఐఎస్ అంత‌ర్జాతీయ స్కీయింగ్ పోటీలో భార‌త‌దేశానికి ఒక‌టో అంత‌ర్జాతీయ ప‌త‌కాన్ని సాధించిన ఆంచ‌ల్ ఠాకుర్ ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 10 JAN 2018 10:50AM by PIB Hyderabad
ట‌ర్కీ లో జరిగిన ఎఫ్ఐఎస్ అంత‌ర్జాతీయ స్కీయింగ్ పోటీలో భార‌త‌దేశానికి ఒక‌టో అంత‌ర్జాతీయ ప‌త‌కాన్ని సాధించిన ఆంచ‌ల్ ఠాకూర్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

“స్కీయింగ్ లో అంత‌ర్జాతీయ ప‌త‌కాన్ని ఆంచ‌ల్ ఠాకుర్ గెలుచుకొన్నందుకు ఆమెకు ఇవే నా శెభాషులు.  ట‌ర్కీ లో ఎఫ్ఐఎస్ అంతర్జాతీయ స్కీయింగ్ పోటీలో నీ చ‌రిత్రాత్మ‌క విజ‌య సాధ‌న ప‌ట్ల యావ‌త్ దేశ ప్ర‌జ‌లు సంతోషిస్తున్నారమ్మా.  నీ భావి ప్ర‌య‌త్నాలు కూడా ఎంతో అత్యుత్త‌మంగా ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నాను తల్లీ” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు. 

***

(रिलीज़ आईडी: 1516252) आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Kannada