పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
చమురు మరియు గ్యాస్ రంగంలో సహకారం అంశంపై భారతదేశం మరియు ఇజ్రాయల్ ల మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
03 JAN 2018 2:42PM by PIB Hyderabad
చమురు మరియు గ్యాస్ రంగంలో సహకారం అంశంపై భారతదేశం మరియు ఇజ్రాయల్ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ఎంఒయు శక్తి రంగంలో భారతదేశం- ఇజ్రాయల్ సంబంధాలకు ఉత్తేజాన్ని ఇస్తుందని ఆశిస్తున్నారు. ఒప్పందంలో భాగంగా ఉద్దేశించినటువంటి సహకారం ఇరు దేశాలలో పెట్టుబడులకు, సాంకేతిక విజ్ఞానం బదలాయింపు, పరిశోధన & అభివృద్ధి (ఆర్ & డి), సంయుక్త అధ్యయనాల నిర్వహణ, ఇంకా మానవ వనరుల సామర్ధ్యం పెంపుదల వంటి వాటిలో ప్రోత్సాహానికి మార్గాన్ని సుగమం చేయడంతో పాటు స్టార్ట్- అప్ ల రంగంలో కలసి పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.
***
(Release ID: 1515366)
Visitor Counter : 126