మంత్రిమండలి
నవీకరణ యోగ్య శక్తి రంగంలో సహకారం అంశం పై భారతదేశం మరియు ఇటలీ ల మధ్య కుదిరిన ఎమ్ఒయు ను గురించి మంత్రివర్గం దృష్టికి తీసుకురావడమైంది
Posted On:
03 JAN 2018 2:38PM by PIB Hyderabad
నవీకరణ యోగ్య శక్తి రంగంలో భారతదేశం మరియు ఇటలీ ల మధ్య సహకారానికి ఒక అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎమ్ఒయు) కుదుర్చుకొన్న సంగతిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఎమ్ఒయు పై న్యూ ఢిల్లీ లో 2017 అక్టోబర్ 30వ తేదీ నాడు సంతకాలయ్యాయి. భారతదేశ గణతంత్ర ప్రభుత్వ నూతన మరియు నవీకరణ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఆనంద్ కుమార్, భారతదేశంలో ఇటలీ రాయబారి శ్రీ లొరేనెజో ఏంజలోనీ లు ఈ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.
సరికొత్త మరియు నవీకరణ యోగ్య శక్తి అంశాలపై సాంకేతికపరమైన ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడం కోసం ఒక సహకార పూర్వక వ్యవస్థాత్మక సంబంధాన్ని పరస్పరం సమాన ప్రయోజనకారిత్వం మరియు ఆదాన ప్రదానాల ప్రాతిపదికలతో నెలకొల్పుకోవాలన్నది భారతదేశం, ఇంకా ఇటలీ ల ధ్యేయంగా ఉంది. సహకరించుకోదగిన రంగాలకు సంబంధించిన అంశాలను సమీక్షించడం, పర్యవేక్షించడం మరియు చర్చించడం కోసం ఒక సంయుక్త కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్ఒయు లో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పటిష్టపరచుకోవడంలో తత్సంబంధిత సమాచార వ్యవస్థను రూపొందించుకోవడంతో పాటు, ప్రావీణ్యాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని కూడా ఇందులో పేర్కొన్నారు.
***
(Release ID: 1515363)
Visitor Counter : 152