ప్రధాన మంత్రి కార్యాలయం
బహుముఖ ప్రజ్ఞావంతుడైన నటుడు శ్రీ శశి కపూర్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
04 DEC 2017 7:21PM by PIB Hyderabad
బహుముఖ ప్రజ్ఞావంతుడైన నటుడు శ్రీ శశి కపూర్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘శశి కపూర్ గారి బహుముఖ ప్రజ్ఞ ను ఆయన నటించిన చలనచిత్రాలలోనే కాకుండా నాటకాలలో కూడా వీక్షించవచ్చు. ఆయన గొప్ప ఉద్వేగంతో రంగస్థలాన్ని వృద్ధిపరచారు. ముందు తరాల వారు సైతం ఆయన తేజోమయమైన నటనను జ్ఞాపకం పెట్టుకొంటారు. ఆయన కన్నుమూత నాకు విచారాన్ని మిగిల్చింది. ఆయన కుటుంబానికి మరియు ప్రశంసకులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
(Release ID: 1511896)
Visitor Counter : 63