PIB Headquarters

ఢిల్లీ పోలీస్ లో ఎస్.ఐ. లు, సిఎపిఎఫ్ లు, అసిస్టెంట్ ఎస్.ఐ. ల భర్తీకి సిఐఎస్ఎఫ్ పరీక్ష, 2017

Posted On: 28 JUN 2017 6:44PM by PIB Hyderabad

ఢిల్లీ పోలీసు శాఖలో సబ్- ఇన్ స్పెక్టర్ (ఎస్.ఐ.)లుసిఎపిఎఫ్ లు మరియు అసిస్టెంట్ సబ్- ఇన్ స్పెక్టర్స్  నియామకానికి ఉద్దేశించిన సిఐఎస్ఎఫ్ పరీక్ష, 2017 (ఒకటో పేపర్)ను దక్షిణాది ప్రాంతం లోని 44621 అభ్యర్థులకు కంప్యూటర్ బేస్ డ్ పద్ధతిన నిర్వహించనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సి) సంయుక్త కార్యదర్శి/ప్రాంతీయ సంచాలకుడు (ఎస్ఆర్) శ్రీ పి. కరుప్పస్వామి తెలిపారు.  ఈ పరీక్ష తెలంగాణ రాష్ట్రంతమిళ నాడుకేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో 2017 జులై 1వ తేదీ నుంచి 2017 జులై5వ తేదీ వరకు జరుగుతుందనిఆంధ్ర ప్రదేశ్ లో 2017 జులై 3వ తేదీ నుంచి 2017 జులై 5వ తేదీ వరకు జరుగుతుందని ఆయన వివరించారు. పరీక్ష తెలంగాణ లోని హైదరాబాద్ లోతమిళ నాడు లోని చెన్నైతిరుచిరాపల్లిలోకేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ని పాండిచ్చేరిలోఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరుకర్నూలురాజమండ్రితిరుపతివిజయవాడవిశాఖపట్నంలలో ఉంటుంది.  ఉదయం పూట 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకుమధ్యాహ్నం పూట 2గం. 45 ని.ల నుంచి సాయంత్రం 4గం. 45ని.ల వరకు పరీక్ష ను నిర్వహిస్తారు.  అభ్యర్థులకు ఇ-అడ్మిట్ కార్డులను ఇప్పటికే www.sscsr.gov.in వెబ్ సైట్ లో పోస్ట్ చేయడమైంది.  ఈ వివరాలను అభ్యర్థులు తెలిపిన ఫోన్ నంబర్ లకు ఎస్ఎమ్ఎస్ మరియు వారిచ్చిన మెయిల్ ఐడీ లకు ఇ-బెయిల్ చేయడమైంది. ఇ-అడ్మిషన్ సర్టిఫికెట్చెల్లుబాటయ్యే సిసలైన గుర్తింపు రుజువు పత్రం ఉంటేనే పరీక్షకు అనుమతిస్తారు.  మరిన్ని వివరాలకు అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సదరన్ రీజనల్ ఆఫీస్ హెల్ప్ లైన్ నంబర్ లలో (ల్యాండ్ లైన్ 044-28251139, మొబైల్: 9445195946) సంప్రదించవచ్చు.

 

*** 


(Release ID: 1493995) Visitor Counter : 58


Read this release in: English