PIB Headquarters

హైదరాబాద్ లోని మెస్సర్స్ బిపిఆర్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ కు జైలు శిక్ష విధించిన ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయమూర్తి

Posted On: 08 JUN 2017 7:31PM by PIB Hyderabad

  హైదరాబాద్ లోని మెస్సర్స్ బిపిఆర్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీమతి మెర్ల గీతారాణి సేవింగ్స్ బ్యాంకు అకౌంటులో జమ చేసిన 60 లక్షల రూపాయలకు సంబంధించి వివరణను ఇవ్వడంలో విఫలమైనందున ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271(1)(c) కింద విధించిన 22 లక్షల రూపాయల జరిమానాను చెల్లించలేదని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కమ్ టాక్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో ఆదాయపు పన్ను విభాగం ఆ అసెసి పైన ఆర్థిక నేరాల న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయమూర్తి పన్నులను చెల్లించనందుకు నిందితురాలికి 6 నెలల కఠిన జైలు శిక్షను, 10 వేల రూపాయల జరిమానాను విధించారు.

 

***


(Release ID: 1492300) Visitor Counter : 108
Read this release in: English