PIB Headquarters

2017 జులై 24వ తేదీన పోస్టల్ పెన్షన్ అదాలత్ ను నిర్వహించనున్న తెలంగాణ సర్కిల్

Posted On: 24 MAY 2017 6:54PM by PIB Hyderabad

 

2017 జూన్ నెలాఖరుతో ముగిసే అర్థ సంవత్సర కాలానికి గాను, రెండవ ప్రాంతీయ తపాలా పింఛన్ అదాలత్ ను 2017 జులై 24వ తేదీ (సోమవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఉన్న డాక్ సదన్ కమిటీ హాలులో నిర్వహించనున్నారు. పోస్టల్ పెన్షనర్స్ తమకు సంబంధించిన పింఛను, గ్రాట్యుటి, ఇతర సంబంధిత అంశాలపై తమకు ఏవైనా సమస్యలు ఉంటే 2017 జులై 10వ తేదీ లోపు శ్రీ ఎన్. పద్మనాభరావు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఐఎఫ్ఎ), ఆఫీస్ ఆఫ్ ది పోస్ట్ మాస్టర్ జనరల్, హైదరాబాద్  ప్రాంతం, 5వ అంతస్తు, డాక్ సదన్, అబిడ్స్, హైదరాబాద్ – 500 001 కి పంపాలని, ఈ గడువు తేదీ తరువాత అందే దరఖాస్తులను పరిశీలించబోమని హైదరాబాద్ ప్రాంత పోస్ట్ మాస్టర్ జనరల్ తెలిపారు.



(Release ID: 1490675) Visitor Counter : 112


Read this release in: English