PIB Headquarters

ప్రజానీకం అందరూ రూ. 10 నాణెములను చట్టబద్దమైనవి గా స్వీకరించవచ్చును - రిజర్వు బ్యాంక్

Posted On: 07 FEB 2017 6:38PM by PIB Hyderabad

 

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని కొందరు,  సరైన అవగాహన లేనటువంటి వ్యక్తులుకొన్ని చోట్ల రూ.10 నాణెముల యొక్క చట్ట బద్ధత గురించివర్తకులుదుకాణదారులు మరియు సామాన్య ప్రజానీకములలో సందేహములు లేపుతున్నట్లు తెలిసింది. 

 


భారతీయ రిజర్వు బ్యాంకు ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికీ తెలియచేయునది ఏమనగా ఇటువంటి పుకార్లను నమ్మకుండా,  ఈ నాణెములను చట్టబద్దమైనవిగా తమ లావాదేవీలలో స్వీకరించవచ్చును. 


భారత ప్రభుత్వ టంకశాలల్లో తయారైన నాణెములను రిజర్వు బ్యాంకు చలామణి లోకి తెస్తుంది.  ఈ నాణెములు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి.  ప్రజల లావాదేవీల అవసరాలను తీర్చడంకోసంఆర్ధికసామాజికసాంస్కృతిక విషయాలను ప్రతిబింబించె కొత్త డిజైన్ మరియు కొత్త డినామినేషనలలో నాణెములను తరచుగా ప్రవేశపెట్టడం జరుగుతుంది.   నాణెములు చాలా కాలం చలామణిలో ఉంటాయి కనుక ఒకే సమయములో వివిధ డిజైన్లు  మరియు వివిధ ఆకృతులు కలిగిన నాణెములు చలామణిలో ఉండవచ్చును.   జూలై 2011 లో రూపాయి చిహ్నంను ప్రవేశపెట్టడం ఇలాంటి ఒక మార్పు.  కనుక కొత్త రూ.  10  నాణెం రూపాయి గుర్తు కలిగి ఉంటాయి కానీ అవే పాత రూ. 10 నాణెములు రూపాయి గుర్తు కలిగి ఉండవు.  కానీ ఈ రెండు రకముల నాణెములు  కూడా చట్టబద్దమైనవి మరియు లావాదేవీలకు అర్హమైనవని తెలియచేయడమైనది.


****



(Release ID: 1482072) Visitor Counter : 97


Explainer release reference

PUBLIC CAN CONTINUE TO ACCEPT RS 10 COINS AS LEGAL TENDER: RBI
This link will take you to a webpage outside this websiteinteractive page. Click OK to continue.Click Cancel to stop :   PUBLIC CAN CONTINUE TO ACCEPT RS 10 COINS AS LEGAL
Read this release in: English