ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ సాంస్కృతిక చర్చలను తీర్చిదిద్దడంలో పెరుగుతున్న భారత నాగరికత వారసత్వ పాత్రను తెలియజెప్పే కథనాన్ని పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 25 NOV 2026 1:37PM by PIB Hyderabad

ప్రపంచ సాంస్కృతిక చర్చలను తీర్చిదిద్దడంలో పెరుగుతున్న భారతీయ నాగరికత వారసత్వ పాత్ర గురించి కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.
తొలి ఎస్‌సీవో నాగరికతా చర్చా వేదిక, బలమైన సాంస్కృతిక సహకారానికి అవసరమైన విధివిధానాలను అందించే ఇంద్రప్రస్థ ప్రకటన గురించి శ్రీ షెకావత్ వివరించారు. అలాగే వారసత్వ పరిరక్షణ, సాంస్కృతిక పరిశోధన, ఆవిష్కరణ, సృజనాత్మక సంస్థల ద్వారా తన సుసంపన్నమైన నాగరిక సంప్రదాయాలను ప్రపంచానికి భారతదేశం ఏ విధంగా అందించగలదో తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ప్రపంచ సాంస్కృతిక చర్చలను తీర్చిదిద్దడంలో భారత నాగరికత వారసత్వ పాత్ర విస్తరిస్తోంది.

తొలి ఎస్‌సీవో నాగరికత చర్చా వేదిక గురించి, మరింత బలమైన సాంస్కృతిక సహకారానికి విధివిధానాలను రూపొందించే ఇంద్రప్రస్థ ప్రకటన గురించి కేంద్ర మంత్రి శ్రీ @gssjodhpur రాశారు.

వారసత్వ పరిరక్షణ, సాంస్కృతిక పరిశోధన, ఆవిష్కరణ, సృజనాత్మక రంగాల ద్వారా భారతదేశం తన సుసంపన్నమైన నాగరికత సంప్రదాయాలను విస్తృత ప్రపంచానికి ఏ విధంగా పరిచయం చేయగలదో ఆయన తెలియజేశారు.


https://indianexpress.com/article/opinion/columns/sco-civilisational-dialogue-forum-lets-create-spaces-where-civilisations-engage-with-dignity-10977257/lite/”

***


(రిలీజ్ ఐడి: 2341141) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati