నాడు పోస్టు చేయడమైనది:
25 NOV 2026 1:37PM by PIB Hyderabad
కీలక రంగాల్లో స్థిరమైన సంస్కరణలు, పెట్టుబడుల ద్వారా వికసిత్ భారత్-2047 దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణాన్ని తెలియజేసేలా కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అధ్యక్షుడు శ్రీ ఆర్ ముకుందన్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడులు, జీఎస్టీ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, కార్పొరేట్ పన్ను సంస్కరణలు, పీఎల్ఐ పథకాలు, వాణిజ్య ఒప్పందాల ద్వారా బలమైన పునాదుల ఏర్పాటును శ్రీ ముకుందన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని శాశ్వత సంపదగా మార్చేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి టీమ్ భారత్‌గా పనిచేయాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
"నిరంతర సంస్కరణలు, పెట్టుబడుల ద్వారా వికసిత్ భారత్-2047 దిశగా భారతదేశ ప్రయాణం రూపుదిద్దుకుంటోంది.
మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడులు, జీఎస్టీ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, కార్పొరేట్ పన్ను సంస్కరణలు, పీఎల్ఐ పథకాలు, వాణిజ్య ఒప్పందాల ద్వారా ఏర్పాటైన బలమైన పునాదుల గురించి @FollowCII అధ్యక్షుడు ఆర్. ముకుందన్ కథనంలో పేర్కొన్నారు.
భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని శాశ్వత సంపదగా మార్చేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి టీమ్ భారత్‌గా పనిచేయాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేశారు.
https://www.business-standard.com/opinion/columns/the-article-a-cii-president-will-write-in-2047-a-roadmap-for-industry-126112401097_1.html”
***