ప్రధాన మంత్రి కార్యాలయం
ధర్మాన్ని, ధనాన్ని, ఆహారాన్ని, గురు బోధనలను, వైద్యాన్ని సరైన పద్ధతిలోనే స్వీకరించడం మంచిదని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 NOV 2026 9:18AM by PIB Hyderabad
మన ప్రవర్తనలో ధర్మానికి కట్టుబడి ఉండటం, ధనాన్ని నిజాయతీతో సంపాదించడం, సరి అయిన ఆహారాన్ని భుజించడం, గురువు మార్గదర్శకత్వాన్ని పొందడం, ఆరోగ్యానికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగివుండటం ముఖ్యమని, వీటిని జీవితంలో సక్రమంగా ఉపయోగించుకుంటేనే అవి ప్రయోజనకరం అవుతాయని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ధర్మం ధనం చ ధాన్యం చ గురోర్వచనమౌషధమ్
సుగృహీతం చ కర్తవ్యమన్యథా తు న జీవతి’’ అని పేర్కొన్నారు.
పైన చెప్పిన శ్లోకానికి అర్థం ఇదీ.. ధర్మం అంటే రుజువర్తన, ఆధ్యాత్మిక సద్గుణం. ధనం అంటే నిజాయతీగా సంపాదించింది. ధాన్యం అంటే ఆహార సామగ్రి. గురువుల వచనాలు అంటే గురువు బోధించే మాటలు, గురువు మనకు అందించే మార్గదర్శనం. ఔషధం అంటే మందులు, మానవ ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవడం. వీటన్నింటిని సరి అయిన పద్ధతుల్లో సంపాదించుకొని, జీర్ణించుకుని, జీవనంలో ఆచరణలోకి తెచ్చుకోవాలి. వీటిని సరిగా ఉపయోగించకపోతే వీటి నుంచి మనిషి జీవితానికి అందగల వాస్తవిక ప్రయోజనాలు అందవు సుమా.
***
(రిలీజ్ ఐడి: 2336396)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam