పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2026 4:48PM by PIB Hyderabad
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) నవంబర్ 5, 2026న హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో గల పర్యావరణ భవన్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026పై అవగాహనతో పాటు ఆచరణాత్మక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. కొత్త నిబంధనల ప్రకారం సంబంధిత ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఉన్న చట్టబద్ధమైన విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్వహించే ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్‌డబ్ల్యూఎం) కేంద్రీకృత ఆన్‌లైన్ పోర్టల్‌ను ఎలా ఉపయోగించాలో ఆచరణలో చూపించడం కూడా కార్యక్రమ లక్ష్యం.
ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026కు రాష్ట్ర నోడల్ అధికారిగా, రాష్ట్ర మాస్టర్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న టీజీపీసీబీ సీనియర్ పర్యావరణ ఇంజినీర్ శ్రీమతి ఎం. సుజనా శ్రీ శిక్షణ ఇచ్చారు. టీజీపీసీబీ సభ్య కార్యదర్శి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏ&యూడీ), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్&ఆర్‌డీ), జిల్లా కలెక్టర్లు, పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీలు), గ్రామీణ స్థానిక సంస్థలు (ఆర్‌ఎల్‌బీలు), గ్రామ పంచాయతీలు (జీపీలు), పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారి (బీడబ్ల్యూజీలు) చట్టబద్ధమైన బాధ్యతలను ఆ శిక్షణ కార్యక్రమంలో వివరించారు.

సీపీసీబీ కేంద్రీకృత ఆన్‌లైన్ ఎస్‌డబ్ల్యూఎం పోర్టల్ ఎలా పనిచేస్తుందో ముందుగా వివరించారు. ఆ తర్వాత పోర్టల్‌లోని సదుపాయాలను, వాటిని ఉపయోగించే విధానాన్ని ఆచరణలో చూపించారు. యూడీడీ, యూఎల్‌బీలు, ఆర్‌డీడీ, గ్రామ పంచాయతీలు, బీడబ్ల్యూజీలు పోర్టల్‌లో నమోదు చేసుకోవడం నుంచి దాన్ని ఉపయోగించడం ప్రారంభించే వరకు అన్ని దశలనూ వివరించారు. యూజర్ ఖాతా తెరవడం, దరఖాస్తుల సమర్పణ, పరిశీలన, వివరాల నమోదు, వ్యర్థాల నిర్వహణ కేంద్రాల నమోదు, జియో ట్యాగింగ్, తనిఖీలకు సంబంధించిన పనులు, వార్షిక రిటర్నులు, పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారి విస్తృత బాధ్యత (ఈబీడబ్ల్యూజీఆర్) కింద జారీ చేసే ధ్రువపత్రాలు, అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారం, పోర్టల్‌లోని ఇతర సంబంధిత సదుపాయాలను శిక్షణలో చూపించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు పోర్టల్‌లో తమ పనులను స్వయంగా పూర్తి చేసుకునేలా వారికి వర్తించే లాగిన్ విధానాలను, ప్రతి దశలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను, తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. నిబంధనల అమలులో సమన్వయం, పర్యవేక్షణ, నిబంధనలను ఏ మేరకు పాటిస్తున్నారో నివేదించడం, కేంద్రీకృత ఆన్‌లైన్ పోర్టల్‌లో సంబంధిత సమాచారాన్ని నిర్వహించడం వంటి అంశాల్లో ఆయా శాఖలు, అధికారుల పాత్రను కూడా శిక్షణలో వివరించారు.
_20261105175325_77179d.jpeg)
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల అధికారులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. మిగిలిన జిల్లాల అధికారులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు కూడా ప్రత్యక్షంగా హాజరయ్యారు.
***