ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆత్మ సాక్షాత్కారానికి, మనిషి అంతర్గత శక్తికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 04 NOV 2026 11:22AM by PIB Hyderabad

మనిషి తాను ఎవరో తెలుసుకున్నప్పుడు కలిగే మార్పులు గొప్పవని చాటుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. మన లోపలి అసలు శక్తిని కనుగొన్నామంటే  అంతరంగంలో అమిత శక్తితో పాటు ఆత్మవిశ్వాసం  కూడా అధికం అవుతుందని, దాంతో మానసిక వ్యథ నుంచి బయటపడడంలో సాయం లభించి పరమ శాంతి వైపు, అమరత్వం వైపు పయనించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సంస్కృత భాషా సుభాషితాన్ని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ:
‘‘ప్రతిబోధవిదితం మతమమృతత్వం హి విన్దతే
ఆత్మనా విన్దతే వీర్యం విద్యయా విన్దతేఅమృతమ్’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2332399) సందర్శకుల సూచీ సంఖ్య : : 21