వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణ వ్యాప్తంగా టెలికాం పెన్షనర్ల కోసం జీవన్‌ ప్రమాణ్‌ శిబిరాలను నిర్వహించనున్న టెలికాం శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 02 NOV 2026 8:50PM by PIB Hyderabad

పెన్షన్‌, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డీఓపీ, పీడబ్లల్యూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ ప్రచారం–5.0 (డీఎల్‌సీ 5.0)లో భాగంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో టెలికాం పెన్షనర్ల కోసం జీవన్‌ ప్రమాణ్‌ శిబిరాలను నిర్వహించనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్స్‌ విభాగం వెల్లడించింది.

 

రాష్ట్రవ్యాప్తంగా నివసిస్తున్న టెలికాం పెన్షనర్లకు జీవిత ధ్రువీకరణ పత్రాల సమర్పణ, అక్కడికక్కడే ధ్రువీకరణ సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

 

ఈ శిబిరాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కింది ప్రాంతాల్లో నిర్వహించనున్నారు..

 

1. కరీంనగర్‌-2026 నవంబర్‌ 6

జీఎంటీడీ కార్యాలయం, బీఎస్‌ఎన్‌ఎల్‌, టెలిఫోన్‌ భవన్‌, టవర్‌ సర్కిల్‌ రోడ్‌, సాఫ్టీ పాయింట్‌ ఎదురుగా, కరీంనగర్‌, తెలంగాణ – 505001.

 

2. వరంగల్‌-2026 నవంబర్‌ 13

పీజీఎం కార్యాలయం, బీఎస్‌ఎన్‌ఎల్‌, వరంగల్‌ – 506002.

సంప్రదించాల్సిన అధికారి: జనరల్‌ మేనేజర్‌.

 

3. నిజామాబాద్‌-2026 నవంబర్‌ 13

పీజీఎంబీఏ కార్యాలయం, నిజామాబాద్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచార్‌ భవన్‌, గాంధీ చౌక్‌, నిజామాబాద్‌ – 503001.

సంప్రదించాల్సిన అధికారి: ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌.

 

4. చిక్కడపల్లి, హైదరాబాద్‌-2026 నవంబర్‌ 17

ప్రిన్సిపల్‌ సీసీఏ, తెలంగాణ సర్కిల్‌ కార్యాలయం, చిక్కడపల్లి, హైదరాబాద్‌ – 500020.

 

5. కేపీహెచ్‌బీ, హైదరాబాద్‌-2026 నవంబర్‌ 17

ప్రిన్సిపల్‌ సీసీఏ, తెలంగాణ సర్కిల్‌ కార్యాలయం, కేపీహెచ్‌బీ, హైదరాబాద్‌ – 500072.

 

6. మహబూబ్‌నగర్‌ -2026 నవంబర్‌ 20

డీజీఎం కార్యాలయం, బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌, బస్టాండ్‌ సమీపంలో, మహబూబ్‌నగర్‌ – 509001.

 

ఇవే కాకుండా, హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో 2026 నవంబర్‌ 1 నుంచి నవంబర్‌ 30 వరకు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనున్నారు. శనివారాలు, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఈ శిబిరం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. ప్రిన్సిపల్‌ సీసీఏ, తెలంగాణ సర్కిల్‌ కార్యాలయం, చిక్కడపల్లి, హైదరాబాద్‌-500020 వద్ద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు.

***


(రిలీజ్ ఐడి: 2331996) సందర్శకుల సూచీ సంఖ్య : : 33
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English