సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
స్వచ్ఛ భారత్కు సమిష్టి భాగస్వామ్యం అవసరం; పరిశుభ్రత అనేది నిరంతర బాధ్యత: శ్రీ జి. సురేష్ కుమార్
పిఐబి, సీబీసీ ఆధ్వర్యములో విజయవాడ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం లో ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ శ్రమదాన కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 8:07PM by PIB Vijayawada
“స్వచ్ఛతా మే సహభాగ్ -స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్” అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హి సేవా 2026లో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన “ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్” శ్రమదానంలో విజయవాడ పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) , సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజీఓ కాంప్లెక్స్ పరిసరాల్లో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పిఐబి, సీబీసీ డైరెక్టర్ శ్రీ జి. సురేష్ కుమార్, ఐఐఎస్ మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అని అన్నారు. ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజూ కొనసాగించాల్సిన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.


పరిశుభ్రతను రోజూవారి జీవితంలో భాగం చేసుకోవాలని, పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని అధికారులు,సిబ్బందికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పిఐబి, సీబీసీ అధికారులు, సిబ్బంది పాల్గొని సీజీఓ కాంప్లెక్స్లో శ్రమదానం నిర్వహించారు.
***
(రిలీజ్ ఐడి: 2317921)
సందర్శకుల సూచీ సంఖ్య : : 53