సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘స్వచ్ఛ భారత్’ ప్రజల భాగస్వామ్యంతో సాగుతున్న ఉద్యమం... పరిశుభ్రత నిరంతర బాధ్యత: పీఐబీ హైదరాబాద్ ఏడీజీ శ్రీమతి శ్రుతి పాటిల్
కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లో ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ శ్రమదానంలో పాల్గొన్న పీఐబీ, సీబీసీ అధికారులు
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 2:27PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని కవాడిగూడ సీజీఓ టవర్స్ ప్రాంగణం గురువారం స్వచ్ఛతా కార్యక్రమానికి వేదికగా మారింది. “స్వచ్ఛతా మే సహభాగ్-స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్” ఇతివృత్తంతో చేపట్టిన “స్వచ్ఛతా హీ సేవా–2026”లో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన “ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్” శ్రమదానంలో హైదరాబాద్‌లోని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) , సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజీఓ టవర్స్ పరిసరాల్లో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శ్రుతి పాటిల్ ఐఐఎస్ మాట్లాడుతూ... స్వచ్ఛ భారత్ మిషన్ ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్న ఉద్యమంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించిన విషయాన్ని గుర్తుచేశారు. పరిశుభ్రత అనేది ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజూ కొనసాగించాల్సిన బాధ్యత అని ఆమె అన్నారు. పరిశుభ్రతను తమ రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని అధికారులు, సిబ్బందికి పిలుపునిచ్చారు.

సీజీఓ టవర్స్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను శ్రీమతి శ్రుతి పాటిల్ అభినందించారు. వారి అంకితభావంతో కూడిన సేవలకు గుర్తింపుగా గ్లౌవ్స్, శానిటేషన్ కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా సీజీఓ టవర్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శ్రుతి పాటిల్ ఐఐఎస్‌తో పాటు పీఐబీ, సీబీసీ హైదరాబాద్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
_20261001143410_e279ee.jpeg)
***
(రిలీజ్ ఐడి: 2317616)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25