ఔషధాల విభాగం
‘పీఆర్‌ఐపీ’ తొలి విడత కింద ₹1,600 కోట్లతో 41 ఫార్మా-మెడ్‌టెక్ ఆవిష్కరణ ప్రాజెక్టులకు ఆమోదం
ఈ జాబితాలో కొత్త ఔషధాల ఆవిష్కరణ నుంచి అత్యాధునిక వైద్య సాంకేతికతల దాకా పలు ఆవిష్కరణల ప్రాజెక్టులున్నాయి
ఫార్మా-మెడ్‌టెక్ పరిశోధన-అభివృద్ధిపై మొత్తం పెట్టుబడులు ₹4,620 కోట్లు
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 7:40PM by PIB Hyderabad
భారత “ఫార్మా-మెడ్‌టెక్ రంగ పరిశోధన-ఆవిష్కరణల ప్రోత్సాహక కార్యక్రమం” (పీఆర్‌ఐపీ) తొలివిడత కింద దాదాపు ₹1,600 కోట్ల ఆర్థిక సహాయం అందించేలా 41 ప్రాజెక్టులకు ఆమోద ముద్ర పడింది. దీనికి అదనంగా ఈ ప్రాజెక్టుల ద్వారా అదనంగా ₹3,020 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు కూడా వస్తాయని అంచనా. అంటే- ఈ ప్రాజెక్టులలో మొత్తం పరిశోధన-అభివృద్ధి రంగంలో మొత్తం పెట్టుబడులు ₹4,620 కోట్లకు చేరుతాయి. ప్రస్తుతం ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులతో సరికొత్త ఔషధాల ఆవిష్కరణ, క్లినికల్ అభివృద్ధి, వినూత్న వైద్య సాంకేతికతలు సహా ఆవిష్కరణల విలువ వ్యవస్థ మరింత విస్తృతమవుతుంది.
ఇప్పటివరకు ఆమోదించిన 41 ప్రాజెక్టులలో 12 ప్రారంభ దశలో ఉండగా, 29 తదుపరి దశకు చేరాయి. వీటిలో 19 ప్రాజెక్టులను అంకుర సంస్థలు, ‘ఎంఎస్‌ఎంఈ’ల చేపట్టా, మిగిలిన 22 పెద్ద కంపెనీల చేతిలో ఉన్నాయి. ప్రాధాన్య రంగాల పరంగా చూస్తే- 27 ప్రాజెక్టులు ‘కొత్త ఔషధ’ విభాగం కిందకు, 5 ‘సంక్లిష్ట జెనరిక్స్-బయోసిమిలార్స్’ కిందకు, 9 ‘నవ్య వైద్య పరికరాల’ కిందకు వస్తాయి.
ప్రధానంగా పరిమాణం ప్రాతిపదికగా గల ఫార్మాస్యూటికల్ నమూనా నుంచి ఆవిష్కరణాధారిత, సాంకేతిక పరిజ్ఞాన-కేంద్రక నమూనా వైపు పరిణామాత్మకతను ఇవన్నీ ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఈ రూపాంతరీకరణలో ఇప్పటికే స్థిరపడిన ఔషధ కంపెనీలు, బయోటెక్నాలజీ సంస్థలు, మెడ్‌టెక్ ఆవిష్కర్తలు ఒకే వేదికపైకి వస్తారు.
ఈ జాబితాలకు సంబంధించి- “బయోకాన్, భారత్ బయోటెక్, సన్ ఫార్మా, వోక్‌హార్డ్, జైడస్, మ్యాన్‌కైండ్ ఫార్మా, పాండోరమ్ టెక్నాలజీస్, సెల్లోజెన్ థెరప్యూటిక్స్, ఆరిజీన్ ఆంకాలజీ, బగ్‌వర్క్స్ రీసెర్చ్” వంటి కంపెనీలు ఆవిష్కరణ ప్రాజెక్టులలో ఉన్నాయి. ఇవన్నీ ‘పీఆర్‌ఐపీ’ కింద మద్దతు గల విస్తృత శ్రేణి ఆవిష్కరణలకు కృషి చేస్తాయి. వీటిలో ‘ఫస్ట్-ఇన్-క్లాస్’ ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతలు, ప్రపంచ మార్కెట్ల సంధానావకాశాలుగల ఆవిష్కరణలు, అధిక ప్రజారోగ్య ప్రాధాన్యంగల రంగాలకు పరిష్కారాలు అందించే వ్యూహాత్మక ప్రాధాన్య ఆవిష్కరణలు ఉన్నాయి. ఈ వర్గీకరణ కింద మద్దతు పొందిన ప్రాజెక్టులలో బహుళ ఔషధ నిరోధక గ్రామ్-నెగటివ్ ఇన్ఫెక్షన్లు లక్ష్యమైన యాంటీ బాక్టీరియల్, కార్నియల్ వ్యాధికి ఎక్సోజోమ్ ఆధారిత పునరుత్పత్తి చికిత్స వంటివి ఉన్నాయి. అలాగే, ఇన్-వివో సీఏఆర్-టి వేదిక, రోగి నుంచి తీసిన రొమ్ము క్యాన్సర్ ఆర్గానాయిడ్లు, ప్రోగ్రామబుల్ ఆర్‌ఎన్‌ఏ లక్షిత యాంటీవైరల్ టెక్నాలజీ, పాయింట్-ఆఫ్-కేర్ ఇన్ఫెక్షన్ నిర్ధారణ సంబంధిత పోర్టబుల్ ప్లాస్మోనిక్-పీసీఆర్, క్షయవ్యాధిని గుర్తించే మైక్రోఫ్లూయిడిక్ వేదిక వంటివి కూడా ఉన్నాయి.
వ్యూహాత్మక ప్రాధాన్య చట్రం కింద నిర్లక్ష్యానికి గురైన ఉష్ణమండల వ్యాధులు, అరుదైన వ్యాధులు, భారత ప్రాధాన్య వ్యాధికారకాలకు ఏఎంఆర్ వ్యాప్తి లేదా మహమ్మారిగా మారే అవకాశం గల వ్యాధికారకాలు, వ్యాధినివారక టీకాలు వంటి రంగాలను పరిష్కరించే ఆవిష్కరణలకు మెరుగైన మద్దతు లభిస్తుంది. ఈ చట్రం కింద ఇప్పటిదాకా 6 ప్రాజెక్టులకు ఆమోద ముద్ర పడింది. వీటిలో బాక్టీరియల్ న్యుమోనియా/మెనింజైటిస్, డెంగ్యూ, ఇన్ఫ్లుయెంజా, తదుపరి తరం టీబీ టీకాల సంబంధిత ప్రాజెక్టులున్నాయి. తొలివిడత కింద ఇంకా మిగిలిన దరఖాస్తులపై మూల్యాంకనం కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు వచ్చే నెలలో వెల్లడవుతాయి.
****
(రిలీజ్ ఐడి: 2317343)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9