ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ బృంద విభాగంలో స్వర్ణం సాధించిన కమల్‌జీత్, సురుచికి ప్రధాని అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2026 11:59PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ బృంద విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సరికొత్త ఆసియా రికార్డును, స్వర్ణాన్ని సాధించిన కమల్‌జీత్, సురుచి ఇందర్ సింగ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

వారి సంకల్పం దేశానికి అపారమైన గౌరవాన్ని తీసుకొచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. వారి భవిష్యత్తు ప్రయాణానికి శుభాకాంక్షలు  తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త ఆసియా రికార్డు!

ఆసియా క్రీడల్లో 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ బృంద విభాగంలో స్వర్ణం గెలిచిన కమల్‌జీత్, సురుచి ఇందర్ సింగ్‌కు అభినందనలు. వారి దృఢసంకల్పం దేశానికి అపారమైన గౌరవాన్ని తీసుకొచ్చింది. వారి భవిష్యత్తు ప్రయాణానికి శుభాకాంక్షలు: పీఎం నరేంద్ర  మోదీ’’

***


(రిలీజ్ ఐడి: 2317032) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam