పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
జైరోప్లేన్ పైలట్ల కోసం శిక్షణా విధానాన్ని ప్రవేశపెట్టిన డీజీసీఏ
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 4:57PM by PIB Hyderabad
“జైరోప్లేన్ పైలట్ లైసెన్స్ జారీ కోసం గ్రౌండ్, ఫ్లయింగ్ శిక్షణ సిలబస్’’ పేరుతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్ (సీఏఆర్-సెక్షన్ 7, సిరీస్ బి, పార్ట్ XXI)ను జారీ చేసింది.
డీజీసీఏ నుంచి జైరోప్లేన్ విభాగంలో పైలట్ లైసెన్స్ పొందాలనుకునే అభ్యర్థులకు అవసరమైన గ్రౌండ్, ఫ్లయింగ్ శిక్షణ పాఠ్యప్రణాళికను సీఏఆర్ ఖరారు చేస్తుంది.
జైరోప్లేన్‌లు ప్రత్యేక రకానికి చెందిన విమానాలు. ఇవి గాలిలో పైకి లేవడానికి స్వయంచాలకంగా తిరిగే రోటర్ వ్యవస్థను ఉపయోగిస్తాయి. అలాగే ముందుకు కదలడానికి కావాల్సిన శక్తిని ఒక ప్రొపెల్లర్ అందిస్తుంది. వీటిని ఎక్కువగా విహార యాత్రలు, విమాన అనుభవ ప్రయాణాలు, వ్యవసాయ పంటలపై మందుల పిచికారీ, బ్యానర్లను లాగడం, నిఘా, భూ సర్వే వంటి కార్యకలాపాలకు ఉపయోగిస్తారు.
భారత్‌లో జైరోప్లేన్‌ల వినియోగం, వాటి కార్యాచరణను సులభతరం చేసే దిశగా ఈ సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ అమలు ఒక తొలి అడుగు. శిక్షణ సంస్థల స్థాపన, తయారీ, అసెంబ్లీ సామర్థ్యాల అభివృద్ధి వంటి తదుపరి చర్యలు.. పౌర విమానయాన రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ నూతన విభాగం వృద్ధికి తోడ్పడతాయి.
***
(రిలీజ్ ఐడి: 2316823)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13