ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో


రజత పతకం గెలుచుకున్న ఇషా సింగ్‌ను అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2026 7:33PM by PIB Hyderabad

2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన ఇషా సింగ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

మంచి స్కోరుతో ఇషా అపారమైన కచ్చితత్త్వాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శించారని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

"2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన ఇషా సింగ్‌కు అభినందనలు. మంచి స్కోరుతో ఇషా అపారమైన కచ్చితత్త్వాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ"


(రిలీజ్ ఐడి: 2316265) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Malayalam