రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వారణాసి డివిజన్‌లో 614.75 రూట్ కిలోమీటర్ల మేర కవచ్ 4.0 అమలుకు రూ.223 కోట్లు మంజూరు చేసిన భారతీయ రైల్వే

నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2026 5:30PM by PIB Hyderabad

దేశీయ సాంకేతికత ద్వారా రైల్వే భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలో భాగంగా.. ఈశాన్య రైల్వే పరిధిలోని వారణాసి (బీఎస్‌బీ) డివిజన్‌లో 614.75 రూట్‌ కిలోమీటర్ల మేర రూ. 223 కోట్ల వ్యయంతో కవచ్‌ వెర్షన్‌ 4.0ను ఏర్పాటు చేసేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించడం ద్వారా వారణాసి డివిజన్‌లో గుర్తించిన మిగిలిన మార్గాల్లో కవచ్‌ 4.0 పరిధిని విస్తరించనున్నారు. తద్వారా రైళ్ల రాకపోకలకు అందుబాటులో ఉన్న భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి.

దేశీయ కవచ్‌ సాంకేతికతతో రైల్వే భద్రత బలోపేతం

దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ (స్వయంచాలక రైలు రక్షణ-ఏటీపీ) వ్యవస్ఠే కవచ్‌. ఇది రైళ్ల నిర్వహణ భద్రతను మెరుగుపరచడానికి రూపొందించారు. ప్రమాదకర పరిస్థితులలో సిగ్నల్ దాటడాన్ని (ఎస్‌పీఏడీ) నివారించడంలో ఇది సహాయపడుతుంది. అవసరమైనప్పుడు స్వయంచాలకంగా బ్రేకులు వేయడంతోపాటు, రైళ్ల రాకపోకలను పర్యవేక్షించడం ద్వారా మరింత సురక్షితమైన రైలు ప్రయాణానికి తోడ్పడుతుంది.

తాజాగా మంజూరైన ఈ నిధులతో వారణాసి డివిజన్‌లోని మిగిలిన మార్గాల్లో రైలు రక్షణ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ చర్య ద్వారా రైళ్ల రాకపోకలు మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా సాగేందుకు దోహదపడుతుంది. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేలు దేశీయ కవచ్‌ సాంకేతికతను విస్తృతంగా అమలు చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఈ ప్రాజెక్టు మరింత ఊతమిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2316261) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada