బొగ్గు మంత్రిత్వ శాఖ
పరిశుభ్రత, అవగాహన, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలతో 'స్వచ్ఛతా హీ సేవ 2026'ను నిర్వహిస్తోన్న ఎంసీఎల్
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 5:43PM by PIB Hyderabad
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) తన ప్రధాన కార్యాలయం, కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని ప్రాంతాల్లో 2026 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ రకాల పరిశుభ్రత కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, విద్యార్థుల భాగస్వామ్య వేడుకలు, సామాజిక సేవా కార్యక్రమాలతో 'స్వచ్ఛతా హీ సేవ 2026'ను ఘనంగా నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమం ఉద్యోగులు, విద్యార్థులు, సమాజంలో బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ అవగాహన, సుస్థిర పద్ధతులను ప్రోత్సహిస్తూ స్వచ్ఛత అందరి సామూహిక బాధ్యత అనే సందేశాన్ని బలపర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.
సంబల్‌పూర్‌లోని ఎంసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. దీనితోనే ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది. పరిశుభ్రత, బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ పట్ల సామూహిక భాగస్వామ్యం, అవగాహనను తెలియజేస్తూ ఎంసీఎల్ మహిళా ఉద్యోగులు 'స్వచ్ఛతా రథ్'ను ప్రారంభించారు.
ఈ క్యాంపెయిన్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో భాగస్వామ్యం, అవగాహనను పెంపొందించడానికి పాఠశాలలు, కాలనీలలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డీఏవీ పాఠశాలకు చెందిన దాదాపు 50 మంది విద్యార్థుల కోసం బలిబంధ వెల్త్ సెంటర్ (మెటీరియల్ రికవరీ కేంద్రం) సందర్శనను ఏర్పాటుచేసింది. ఇది ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల విభజన, తగ్గించడం, పునర్వినియోగించడం, రీసైక్లింగ్ సూత్రాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించింది. తరగతి గది అభ్యాసాన్ని బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ఆచరణాత్మక అవగాహనతో అనుసంధానించడమే ఈ కార్యక్రమానికి ఉన్న ముఖ్య ఉద్దేశం.
ఐఐఎం సంబల్‌పూర్‌లో ఉపన్యాస పోటీలు, బర్లాలోని ఎస్‌యూఐఐటీలో డిబేట్ పోటీలను ఎంసీఎల్ నిర్వహించింది. ఈ పోటీలలో ‘పరిశుభ్రత, సుస్థిరత, సుస్థిరాభివృద్ధిలో యువత పాత్ర’ అనే అంశాలపై చేపట్టిన చర్చల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్ ఇంకా కొనసాగుతోంది. ఎంసీఎల్ ప్రధాన కార్యాలయం, కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రాంతాల్లో 2026 అక్టోబర్ 2 వరకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికను రూపొందించారు.
స్వచ్ఛతా హీ సేవా 2026 ద్వారా అనుబంధ సంస్థలు, చుట్టుపక్కల సమాజాల్లో పరిశుభ్రత, పర్యావరణ బాధ్యత, సుస్థిర పద్ధతుల సంస్కృతిని మరింత బలోపేతం చేయడానికి ఎంసీఎల్ కృషి చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2314708)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4