రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లక్నో డివిజన్‌లోని 607.7 కిలోమీటర్ల మార్గంలో రూ. 252 కోట్లతో కవచ్ 4.0 ఏర్పాటు కోసం భారతీయ రైల్వే ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 19 SEP 2026 4:16PM by PIB Hyderabad

స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైల్వే భద్రత బలోపేతం దిశగా కీలక ముందడుగు వేస్తూ, ఈశాన్య రైల్వేలోని లక్నో డివిజన్‌కు చెందిన 607.7 రూట్ కిలోమీటర్ల మేర కవచ్ వెర్షన్ 4.0ను మొత్తం రూ.252 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది.

ఆమోదించిన ఈ ప్రాజెక్ట్... డివిజన్‌లో గుర్తించిన మిగిలిన విభాగాల్లో కవచ్ 4.0 కవరేజీని విస్తరింపజేస్తూ, రైలు కార్యకలాపాలకు అందుబాటులో ఉన్న భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది.

స్వదేశీ కవచ్ టెక్నాలజీతో రైల్వే భద్రతను పటిష్ఠం చేయడం

కార్యాచరణ భద్రతను మెరుగుపరచడానికి రూపొందించిన, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థే కవచ్. ఇది ప్రమాదకర పరిస్థితుల్లో సిగ్నల్ దాటడాన్ని నివారిస్తుంది. అవసరమైనప్పుడు స్వయంచాలకంగా బ్రేకులు వేస్తుంది. రైలు కార్యకలాపాలను పర్యవేక్షించడం ద్వారా సురక్షితమైన రైలు రవాణాకు మద్దతునిస్తుంది.

రైలు భద్రతా వ్యవస్థలను ఆధునికీకరించడానికి, రైల్వే కార్యకలాపాల భద్రత, విశ్వసనీయతను మెరుగుపరచడానికి భారతీయ రైల్వే తన నెట్‌వర్క్ అంతటా కవచ్‌ను విస్తరింపజేయడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టింది.

 

***


(రిలీజ్ ఐడి: 2312462) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada