ప్రధాన మంత్రి కార్యాలయం
వివాదాల స్థానంలో చర్చలకు ఇచ్చే ప్రాధాన్యం... కేంద్ర - రాష్ట్ర సంబంధాలలో నమ్మకాన్ని ఎలా పెంచుతుందో తెలిపే ఒక వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 2:57PM by PIB Hyderabad
అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు. వివాదాల స్థానంలో చర్చలకు ప్రాధాన్యం పెరగడాన్ని, కేంద్ర - రాష్ట్ర సంబంధాలు నమ్మకంతో బలోపేతం కావడాన్ని, అభివృద్ధి ప్రగతికి కొత్త మార్గాలను తెరుస్తోందని ఈ వ్యాసంలో పేర్కొన్నారు. గత దశాబ్దంలో సాకారమైన సహకార సమాఖ్య విధానంలో వచ్చిన మార్పులు, విశ్వాసంతో మనం ఎంత దూరం ముందుకు సాగాం, ఏమేమి సాధించామనే అంశాలను ఈ వ్యాసం విశ్లేషించింది.
“వివాదాల స్థానంలో సంభాషణకు ప్రాధాన్యం పెరుగుతోంది. విశ్వాసం కేంద్ర, రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేస్తోంది. అభివృద్ధి ప్రగతికి కొత్త మార్గాలను తెరుస్తోంది. అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ తన తాజా వ్యాసంలో - గత దశాబ్దంలో సాకారమైన సహకార సమాఖ్య విధానంలో వచ్చిన మార్పును చక్కగా విశ్లేషించారు. మనం ఎంత దూరం ముందుకు వచ్చాం, విశ్వాసంతో ఏమేమి సాధించామనే విషయాలను ఆత్మపరిశీలన చేసుకునేలా ఈ వ్యాసం సాగింది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2311350)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6