సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
‘‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్ సేవా పురస్కారం 2026’’ అందుకోనున్న ఎన్‌సీఎస్‌సీ చైర్మన్ శ్రీ కిశోర్ మక్వానా
దేశానికి కమిషన్ అందిస్తున్న అంకితభావ సేవలు, సామాజిక న్యాయానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా పురస్కారం
ఢిల్లీలో జరగనున్న 16వ సంసద్ రత్న అవార్డ్స్–2026 కార్యక్రమంలో పురస్కార ప్రదానం
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 7:09PM by PIB Hyderabad
సామాజిక న్యాయానికి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్‌సీఎస్‌సీ) అందిస్తున్న అంకితభావ సేవలు, గణనీయమైన కృషికి గుర్తింపుగా కమిషన్ చైర్మన్ శ్రీ కిశోర్ మక్వానాకు రేపు “డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్ సేవా పురస్కారం 2026”ను ప్రదానం చేయనున్నారు.
ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, సంసద్ రత్న అవార్డ్స్ కమిటీలు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను ఈ గౌరవానికి నామినేట్ చేశాయి. ఢిల్లీలో జరగనున్న 16వ సంసద్ రత్న అవార్డ్స్–2026 కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కార్యక్రమాన్ని పౌర సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

శ్రీ కిశోర్ మక్వానా నాయకత్వంలో జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ షెడ్యూల్డ్ కులాల వర్గాల రాజ్యాంగ హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి పనిచేసే సమర్థవంతమైన సంస్థగా తన పాత్రను మరింత బలోపేతం చేసుకుంది. ఈ వర్గాల ప్రజలకు న్యాయం, గౌరవం, సమానత్వం, సామాజిక సాధికారత కల్పించే దిశగా కమిషన్ చురుగ్గా పనిచేస్తోంది.
కమిషన్ దేశానికి అందిస్తున్న అంకితభావ సేవలు, సామాజిక న్యాయం కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయాలని సంసద్ రత్న అవార్డ్స్ కమిటీ జ్యూరీ నిర్ణయించింది. శ్రీ కిశోర్ మక్వానా నిబద్ధతతో చేస్తున్న కృషి, నాయకత్వంలో కమిషన్ అందించిన విశేష సేవలను కమిటీ తన సమాచారంలో ప్రశంసించింది.

ఈ గౌరవం షెడ్యూల్డ్ కులాల హక్కులను పరిరక్షించడం, సమానత్వం, గౌరవం, సమగ్రతతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయడం పట్ల కమిషన్ కొనసాగిస్తున్న నిబద్ధతకు ప్రతిబింబంగా నిలుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2308072)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5