సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పీఐబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో గుజరాత్‌లో పర్యటిస్తున్న తెలంగాణ మీడియా బృందం
నాడు పోస్టు చేయడమైనది:
06 SEP 2026 1:20PM by PIB Hyderabad
హైదరాబాద్ పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో తెలంగాణకు చెందిన 10 మంది పాత్రికేయుల బృందం గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తోంది. సెప్టెంబర్ 6 నుంచి 12 వరకు వారం రోజులపాటు కొనసాగే ఈ పర్యటనకు మీడియా కమ్యూనికేషన్ అధికారి (ఎమ్ అండ్ సీవో) శ్రీమతి వర్గంటి గాయత్రి నేతృత్వం వహిస్తున్నారు. ఈ రోజు అహ్మదాబాద్ చేరుకున్న ఈ బృందానికి పీఐబీ అధికారులు స్వాగతం పలికారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని విలేకరుల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం, రాష్ట్రాల మధ్య అభివృద్ధి అనుభవాలను పరస్పరం పంచుకోవడమే ఈ పర్యటన ప్రధానోద్దేశం. గుజరాత్‌లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు, వివిధ రంగాల్లో సాధించిన విజయాలను ప్రత్యక్షంగా పరిశీలించే వీలును పాత్రికేయులకు అందించడం ఈ పర్యటన లక్ష్యంగా ఉంది.
ఈ పర్యటనలో భాగంగా సబర్మతీ రివర్ ఫ్రంట్, ధోలేరా ప్రత్యేక పెట్టుబడుల ప్రాంతం (ధోలేరా ఎస్ఐఆర్), గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ), అమూల్ డెయిరీ, ఐక్యతా మూర్తి, సర్దార్ సరోవర్ ఆనకట్ట, తదితర ముఖ్యమైన ప్రాజెక్టులు, సంస్థలను విలేకరుల బృందం సందర్శిస్తుంది. సీఈపీటీ విశ్వవిద్యాలయం, జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, సబర్మతీ మల్టీ మోడల్ హబ్‌లను కూడా వారు సందర్శిస్తారు. అధికారులు, ఇతర భాగస్వాములతో సమావేశమవుతారు.
***
(రిలీజ్ ఐడి: 2307188)
సందర్శకుల సూచీ సంఖ్య : : 47