సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్థిక అభద్రత నుంచి శాస్త్రీయ పరిశోధన దాకా: మల్లెల పృథ్వీ రాజు సాధికారతకు ఎన్ఎఫ్ఎస్‌సీ మద్దతు

నాడు పోస్టు చేయడమైనది: 01 SEP 2026 6:44PM by PIB Hyderabad

ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల విద్యార్థుల కోసం స్థిరమైన ఆర్థిక సహాయం లేకుండా ఉన్నత విద్యనుపరిశోధనను కొనసాగించడం కష్టమవుతుందిసకాలంలో అందే ఫెలోషిప్ సహాయం... విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికివృత్తి జీవితంలో పురోగతి సాధించడానికి అవసరమైన స్థిరత్వాన్నీ అందించగలదు.

షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల జాతీయ ఫెలోషిప్ (ఎన్ఎఫ్ఎస్‌సీపథకం కింద లభించిన మద్దతు ప్రభావాన్ని ప్రదర్శిస్తూ... ఎస్సీ-III సామాజిక వర్గానికి చెందిన 34 ఏళ్ల పరిశోధకుడు శ్రీ మల్లెల పృథ్వీ రాజు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను అధిగమించి తన పీహెచ్‌డీని పూర్తి చేయడంతో పాటుశాస్త్రీయ పరిశోధన రంగంలో తన వృత్తి జీవితంలో ముందుకు వెళుతున్నారు.

నిరుపేద ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన శ్రీ రాజుతన చదువును కొనసాగించడంలో సహాయపడటానికి స్థిరమైన ఆదాయం లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారుతన విద్యా ప్రస్థానంలో నెలవారీఆరు నెలలవారీ ఫెలోషిప్ ప్రక్రియకు అవసరమైన సంతకాల కోసం ప్రయత్నిస్తున్న సందర్భాల్లోనూ విశ్వవిద్యాలయ అధికారుల నుంచి పరిపాలనాపరమైన జాప్యాలువివక్షనూ ఎదుర్కొన్నారు.

ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ శ్రీ రాజు తన విద్యావృత్తిపరమైన లక్ష్యాల పట్ల పూర్తి నిబద్ధతతో ముందుకుసాగారుఆయన ఒక పరిశోధన శాస్త్రవేత్తగా విజయవంతమైన వృత్తిని నిర్మించుకోవాలనే ఆకాంక్షతోశాస్త్రీయ పదవుల కోసం తనను తాను సిద్ధం చేసుకుంటూనే ఉన్నారు.

శ్రీ రాజు డిసెంబర్ 2019 నుంచి డిసెంబర్ 2024 వరకు ఎన్ఎఫ్ఎస్‌సీ పథకం కింద ఫెలోషిప్ సహాయం పొందారుఈ సహాయంలో భాగంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ దశలో నెలకు రూ. 37,000, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ దశలో నెలకు రూ. 42,000 అందుకున్నారు.

ఆ ఫెలోషిప్ ఆయనకు ఏకైక ఆర్థిక ఆసరాగా మారిందిఅది అతని విద్యపరిశోధనప్రాథమిక జీవన వ్యయాలకు సాయపడుతూ... ఆయన పరిస్థితులను సంపూర్ణ ఆర్థిక అభద్రత నుంచి సుస్థిరమైన ఆర్థిక స్వాతంత్య్రానికి మార్చివేసింది.

ఈ మద్దతుతోనే శ్రీ రాజు తన ఆర్థిక ఇబ్బందులను అధిగమించిపరిశోధనపై దృష్టి సారించారుతన పీహెచ్‌డీనీ విజయవంతంగా పూర్తి చేయగలిగారు.

శ్రీ రాజు ప్రస్తుతం హెచ్‌సీయూలో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారుశాస్త్రీయ పదవుల కోసం సన్నద్ధమవుతూనే... పూర్తికాల పరిశోధనా శాస్త్రవేత్తగా స్థిరపడాలనే తన దీర్ఘకాలిక ఆకాంక్ష దిశగా ఆయన పురోగమిస్తున్నారు.

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కాలాన్ని విద్యాపరమైన విజయంవృత్తిపరమైన పురోగతి సాధించే కాలంగా మార్చడంలో ఎన్ఎఫ్ఎస్‌సీ పథకం ఆయనకు ఎంతగానో సహాయపడిందిఈ ఫెలోషిప్తన పరిశోధనా ఆశయాలను వదులుకోకుండానే ఆయన తన ఉన్నత విద్యను పూర్తి చేసేందుకూ వీలు కల్పించింది.

చదువు పట్ల ఆయనకు గల పట్టుదల మూడు పరిశోధనా పత్రాల ప్రచురణకూ దోహదపడిందిఇది శాస్త్రీయ పరిశోధనతో ఆయన నిరంతర అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది.

ప్రచురితమైన పత్రాలు కింది లింకుల్లో అందుబాటులో ఉన్నాయి:

1. https://doi.org/10.1007/s11356-023-27100-3.

2. https://www.frontiersin.org/journals/marine-science/articles/10.3389/fmars.2025.1604055.

3. https://doi.org/10.1007/s10661-025-14670-7.

ఆర్థికంగా వెనకబడిన వర్గాల విద్యార్థులు నిరంతర ఫెలోషిప్ సహాయం ద్వారా ఆర్థిక అడ్డంకులను అధిగమించిడాక్టరేట్ పరిశోధనను పూర్తి చేయడం సహావిజ్ఞాన శాస్త్ర రంగంలో తమ వృత్తి జీవితంలోనూ పురోగమించగలరని శ్రీ రాజు ప్రయాణం నిరూపిస్తుంది.

ఫెలోషిప్ ప్రభావం గురించి శ్రీ రాజు ఇలా అన్నారు...

నేను నిరుపేద ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చానుఈ ఫెలోషిప్ నాకు ఉన్న ఏకైక ఆశాకిరణంఇది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను అధిగమించినా పీహెచ్‌డీని విజయవంతంగా పూర్తి చేయడంతో సహాప్రస్తుత ప్రాజెక్ట్ సైంటిస్ట్ బాధ్యతలు చేపట్టేందుకూ వీలు కల్పించింది.

ఆయన పట్టుదలఎన్ఎఫ్ఎస్‌సీ పథకం కింద లభించిన మద్దతుతో శ్రీ మల్లెల పృథ్వీ రాజు... ఆర్థిక అభద్రత నుంచి డాక్టరేట్ సాధించడంశాస్త్రీయ పరిశోధనలో కీలక బాధ్యతలు చేపట్టడం వరకు పురోగమించారుపరిశోధనా ఆకాంక్షలను బలోపేతం చేయడంలోనూవృత్తిపరమైన అవకాశాలను విస్తరించడంలోనూ విద్యాసంబంధిత మద్దతు పోషించే కీలక పాత్రను ఆయన ప్రయాణం ప్రతిబింబిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2305847) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी