సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఉత్తరాఖండ్ పాత్రికేయ బృందం హైదరాబాద్ పర్యటన
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 7:03PM by PIB Hyderabad
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల క్షేత్రస్థాయి సందర్శన, హైదరాబాద్ నగర సుసంపన్న వారసత్వ అనుభూతి లక్ష్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర పాత్రికేయుల బృందం ఆగస్టు 31న నగరానికి చేరుకుంది. ఈ మేరకు డెహ్రాడూన్ పత్రికా సమాచార సంస్థ (పీఐబీ) అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ సుంద్రియాల్ నేతృత్వాన 15 మంది సభ్యుల పాత్రికేయ బృందం సెప్టెంబరు 4 వరకూ వివిధ ప్రాంతాలను సందర్శిస్తుంది.
ఈ 5 రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజున హైదరాబాద్‌లోని ‘పీఐబీ’ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ మానస్ కృష్ణకాంత్ సహా ఇతర అధికారులతో ఈ బృందం సమావేశమైంది.
తెలంగాణలో పరిణామాత్మక మీడియా రంగం గురించి, కేంద్ర ప్రభుత్వ విధానాలు- ప్రధాన పథకాలు, కార్యక్రమాలపై సమాచార ప్రదానం దిశగా పీఐబీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) చేపట్టిన విస్తృత సమాచార-ప్రచార కార్యక్రమాల గురించి శ్రీమతి శృతి పాటిల్ ఈ సందర్భంగా వారికి వివరించారు.
ప్రగతి ప్రధాన వార్తా కథనాల నివేదన సౌలభ్యం దిశగా పీఐబీ నిర్వహించే కార్యక్రమాలు, పర్యటనలలో పాత్రికేయుల భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని ఆమె ప్రస్ఫుటం చేశారు. తదనుగుణంగా హైదరాబాద్ పర్యటన అనుభవాలను ఉత్తరాఖండ్ ప్రజలతో విశదంగా పంచుకోవాలని ఆమె కోరారు. అలాగే, ఆ రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణపై అవగాహన పెంచడంలో తమ వంతు పాత్ర పోషించాల్సిందిగా సూచించారు.
అనంతరం కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్’ (ఇన్‌కాయిస్)ను ఈ బృదం సందర్శించింది. సముద్ర పరిస్థితుల పర్యవేక్షణ, సునామీపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, అంచనాలు, హెచ్చరికల జారీ సహా సముద్ర సమాచార సేవలలో భారత సామర్థ్యాన్ని ఇక్కడి అధికారులు పాత్రికేయులకు వివరించారు.
ఈ పర్యటనలో భాగంగా ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) సహా కార్మిక-ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఒక ‘ఈఎస్‌ఐసీ’ ఆసుపత్రిని కూడా ఈ ప్రతినిధి బృందం సందర్శించనుంది. తద్వారా పోషకాహార పరిశోధన, ప్రజారోగ్య చర్యలు, ఉద్యోగులకు జాతీయ బీమా పథకం కింద లభించే ఆరోగ్య సంరక్షణ సేవలపై వారికి సంపూర్ణ అవగాహన కలుగుతుంది.
కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గల తెలంగాణ చేనేత-చేతివృత్తుల సంబంధిత ప్రదర్శనను ఈ ప్రతినిధి బృందం సందర్శిస్తుంది. రాష్ట్రంలోని సంప్రదాయ చేతివృత్తులకు, కళాకారులకు చేయూతనివ్వడంలో ఈ రంగం పోషిస్తున్న పాత్రపై అవగాహనకు ఈ సందర్శన తోడ్పడుతుంది.
దేశంలో పేరెన్నికగన్న హైదరాబాద్ నగర సుసంపన్న సాంస్కృతిక-చారిత్రక వారసత్వంపై ప్రత్యక్ష అనుభూతి దిశగా సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, లాడ్ బజార్ తదితర చారిత్రక ప్రదేశాలను కూడా ఈ ప్రతినిధి బృందం సందర్శిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సంస్థలు, కీలక సాంస్కృతిక ప్రదేశాల సందర్శనతో కూడిన ఈ పర్యటన సెప్టెంబరు 4 వరకూ కొనసాగుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2305831)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6