యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకానికి మద్దతు తెలిపిన ఒలింపియన్ జ్వాలా గుత్తా


క్రీడారంగాన్ని మార్చే ఈ పథకం ఎప్పుడో రావాల్సింది: జ్వాలా గుత్తా

2026 - 31 సంవత్సరాల కాలానికి పునరుద్ధరించిన పథకానికి గతంలో కంటే 8 రెట్లు అదనంగా రూ.29,054 కోట్ల నిధుల కేటాయింపు - ఈ పథకం ద్వారా మద్దతు పొందే క్రీడాకారుల సంఖ్యను 10 రెట్లు పెంచాలని లక్ష్యం

కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్య నమూనాగా ఖేలో ఇండియా పథకం - క్రీడాకారులను కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దే ప్రక్రియకు అనుగుణంగా నిధుల కేటాయింపు

పునరుద్ధరించిన పథకం కింద 30 క్రీడాంశాల్లో 10,000 మంది ఖేలో ఇండియా అథ్లెట్లకూ, 20,000 మంది ఖేలో ఇండియా వర్ధమాన అథ్లెట్లకూ ప్రోత్సాహం

నాడు పోస్టు చేయడమైనది: 21 AUG 2026 6:03PM by PIB Hyderabad

పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం భారత క్రీడారంగం రూపురేఖలను మార్చే సామర్థ్యం కలిగి ఉందని రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న (2012 లండన్, 2016 రియోక్రీడాకారిణిప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పతక విజేత జ్వాలా గుత్తా అన్నారుహైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూఈ పథకం క్రీడారంగంలో పెనుమార్పు తీసుకొచ్చే గేమ్‌ చేంజర్‌గా నిలుస్తుందనిచాలా కాలం క్రితమే ఈ పథకం రావాల్సిందని ఆమె పేర్కొన్నారు.

జ్వాలా గుత్తాతో పాటు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏటీఎస్వైస్‌ చైర్‌పర్సన్‌మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏసోనిబాలా దేవిబెంగళూరులోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐప్రాంతీయ డైరెక్టర్‌ శ్రీ విష్ణు సుధాకరన్‌ఢిల్లీలోని ఎస్ఏఐ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీమతి ఎస్హిమబిందు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

 

పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో శ్రీమతి హిమ బిందు మాట్లాడుతూఖేలో ఇండియా పథకంలోని కీలక అంశాలనుతెలంగాణ వంటి రాష్ట్రంపై ఈ పథకం చూపించే ప్రభావాన్ని వివరించారు. 2026–31 కాలానికి అమలయ్యే ఈ పథకానికి గత కేటాయింపుతో పోలిస్తే రెట్లు పెంచి రూ.29,054 కోట్లను కేటాయించారుఈ పథకం ద్వారా మద్దతు పొందే క్రీడాకారుల సంఖ్యను 10 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

“ఈ పథకం కింద క్రీడల్లో అట్టడుగు స్థాయి నుంచి ఒలింపిక్‌ స్థాయి ప్రతిభకు చేరుకునేలా సమగ్ర ప్రణాళిక రూపొందించారువ్యవస్థలోని లోటుపాట్లను ఈ పథకం పరిష్కరిస్తుందికోచ్‌లతో బోర్డును ఏర్పాటు ద్వారా చిన్నారుల క్రీడా ప్రతిభను మరింత మెరుగుపరచేందుకు అవకాశం ఉంటుందిఅకాడమీల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటుమౌలిక సదుపాయాలుక్రీడా సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయి” అని శ్రీమతి హిమబిందు తెలిపారు.

తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధిక ప్రాధాన్యత ఇస్తోందిరాష్ట్రంలో మొత్తం 33 ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేశారువీటిలో మాజీ ఛాంపియన్‌ క్రీడాకారులు 601 మందికి పైగా క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నారుమేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో ఖేలో ఇండియా స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కూడా ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోందిఇందులో రోయింగ్‌వెయిట్‌లిఫ్టింగ్‌ఫెన్సింగ్‌ తదితర క్రీడాంశాల్లో మొత్తం 254 మంది క్రీడాకారులకు శిక్షణప్రోత్సాహం అందుతోందివీరిలో 152 మంది పురుషులు, 102 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు.

రాష్ట్రంలో అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌షూటింగ్‌బ్యాడ్మింటన్‌టేబుల్‌ టెన్నిస్‌సైక్లింగ్‌టెన్నిస్‌ఫుట్‌బాల్‌ తదితర క్రీడాంశాల్లో మొత్తం 19 ఖేలో ఇండియా గుర్తింపు పొందిన అకాడమీలను ఏర్పాటు చేసేందుకు నోటిఫై చేశారుమహిళల కోసం క్రీడల (స్పోర్ట్స్ ఫర్ ఉమెన్విభాగం కింద తెలంగాణలో 127 అస్మిత లీగ్‌లు నిర్వహించగావీటిలో 20,921 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు.

.....గుత్తా ఇలా అన్నారు: “నేనూ ప్రభుత్వ అండతోనే ఎదిగానుప్రభుత్వ మద్దతు లేకుండా ఒక క్రీడాకారిణిగా నేను సాధించినదంతా సాధ్యమయ్యేది కాదుకొత్త రూపంలోని ఈ ఖేలో ఇండియా పథకం చాలా ఆశాజనకంగా కనిపిస్తోందిక్షేత్ర స్థాయి నుంచి అభివృద్ధిసుస్థిరతపై దృష్టి సారించడంతోపిల్లలను క్రీడలకు పంపడాన్ని తల్లిదండ్రులు చాలా సురక్షితంగా భావిస్తారుక్రీడలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తూనే ఉందిఇది ఈ రంగంపై గణనీయ ప్రభావం చూపుతుందిదీని ప్రభావం కూడా అపారంగా ఉంటుందిఈ పథకంతో అనుబంధం ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను” అని అన్నారు.

'ఖేలో ఇండియా ఉత్కృష్ట విద్యాలయాలు', 'ఫీడర్ పాఠశాలలు', 'ఖేలో ఇండియా కేంద్రాలద్వారా ఒక ప్రామాణికమైనశాస్త్రీయమైనసాంకేతికతతో కూడిన ప్రతిభా గుర్తింపు వ్యవస్థను ఏర్పాటు చేయడం కేఐఎస్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిఈ విధానం 'ఖేలో ఇండియా అథ్లెట్లు', 'వర్ధమాన ఖేలో ఇండియా అథ్లెట్లు' (-కేఐఏఅనే విభాగాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖరాష్ట్రాలకు మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంపై కేఐఎస్ ప్రధానంగా దృష్టి సారిస్తోందిఈ దార్శనికతలో భాగంగా ఈ ఏడాది చివర్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను తెలంగాణ నిర్వహించనుందిఖేలో ఇండియా స్కీమ్‌లో ప్రతిభను మెరుగుపరచడంఅథ్లెట్ల నిలుపుదలఅట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పరివర్తనసంస్కరణ-ఆధారిత విజయాల ఆధారంగా నిధులు అందించే నిబంధనతో... కేంద్ర-రాష్ట్రాల సహకార నమూనా సదుపాయం అందుబాటులో ఉంది.

"తెలంగాణ వంటి రాష్ట్రానికి ఇది ఎంతో ప్రయోజనకరంఈ పథకం దీర్ఘకాలిక ప్రణాళికా రచనకు తోడ్పడుతుందిక్రీడలను ఒక అంశంగా పరిగణించే రాష్ట్రాల విధానంపై ఈ దార్శనికత గణనీయ ప్రభావం చూపుతుందిక్రీడలను విద్యా విధానంతో అనుసంధానిస్తున్న క్రమంలోమనం మరింత మెరుగైన ఫలితాలను ఆశించవచ్చుఅని డాక్టర్ సోనిబాలా దేవి అన్నారు.

ఖేలో ఇండియా పథకాన్ని ఇంకా మెరుగుపరుస్తున్నట్లు శ్రీ సుధాకరన్ అన్నారు. “ఈ పథకం ఎలా పనిచేస్తుందిరాష్ట్రాలు దీనిలోని కీలక అంశాలను ఎలా స్వీకరిస్తాయి అనే విషయాలను కార్యాచరణ మార్గదర్శకాలు వివరిస్తాయిగతంలో మేం పరిమిత బడ్జెట్లతో ‘కేంద్రీకృత’ విధానాన్ని అనుసరించేవాళ్లంఈ ఖేలో ఇండియా పథకంభాగస్వాములందరితో జరిపిన విస్తృత చర్చల ఫలితమేఇది అందరికీ ప్రయోజనకరంక్రీడా ఉద్యమాన్నిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్న ‘ఖేలో భారత్ నీతి’ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ కేటాయించారు” అని ఆయన అన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2302113) సందర్శకుల సూచీ సంఖ్య : : 63
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English