జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘సృజన్: వాయిసెస్ ఫ్రమ్ ది లూమ్’ ద్వారా మహిళా చేనేత కార్మికులను సత్కరించనున్న జౌళి మంత్రిత్వశాఖ


భారతీయ చేనేత సంప్రదాయాల పరిరక్షణపై తమ పాత్ర, పట్టుదల, సృజనాత్మకతను పంచుకోనున్న ఆరు చేనేత క్లస్టర్లకు చెందిన 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు

प्रविष्टि तिथि: 12 AUG 2026 6:08PM by PIB Hyderabad

కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన అభివృద్ధి కమిషనర్ (చేనేత) కార్యాలయం దేశ చేనేత రంగం వెనుక ఉన్న మహిళా శక్తిని గౌరవించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారతీయ చేనేత వారసత్వానికి మహిళలు అందిస్తున్న అసమానమైన సేవలను, వారి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాలను, వారి గళాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ‘సృజన్: వాయిసెస్ ఫ్రమ్ ది లూమ్’ పేరిట ఒక ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేయనుంది. ఈ  కార్యక్రమం 2026 ఆగస్టు 13వ తేదీన న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ కేంద్రంలో జరగనుంది. 

 

ఈ సదస్సులో దేశంలోని ఆరు విభిన్న చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా చేనేత కార్మికులు ఒకే వేదికపైకి రానున్నారు. వారి నిజ జీవిత అనుభవాలను, పట్టుదలను, సృజనాత్మకతను వేడుకగా జరుపుకోవడానికి, దేశంలోని సంపన్న చేనేత సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడంలో వారు పోషిస్తున్న కీలక పాత్రను గుర్తించడానికి ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన వేదికను కల్పిస్తుంది.

 

ఈ కార్యక్రమం సందర్భంగా సదస్సులో పాల్గొంటున్న మహిళా నేత కార్మికుల స్ఫూర్తిదాయకమైన కథనాలు, వారి జీవిత ప్రయాణాలు, అనుభవాలతో కూడిన సంకలనాన్ని ఆవిష్కరించనున్నారు. మగ్గం నుంచి వారి అనుభవాలను విస్తృత సమాజానికి చేరవేయడానికి, భారతీయ చేనేత రంగం గుండె చప్పుడుగా నిలిచే మానవీయ కోణాలను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ సంకలనం ఎంతగానో దోహదపడుతుంది. 

 

ఈ  కార్యక్రమానికి జౌళి శాఖ కార్యదర్శి శ్రీమతి నీలం షమీ రావు, చేనేత విభాగం అభివృద్ధి కమిషనర్ డాక్టర్ ఎం బీనా హాజరుకానున్నారు. అలాగే యూఎన్ ఉమెన్ ఇండియా డిప్యూటీ కంట్రీ రిప్రజెంటేటివ్ శ్రీమతి కాంత సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

 

‘సృజన్: వాయిసెస్‌ ఫ్రమ్ ది లూమ్’ ద్వారా భారత చేనేత వారసత్వంపై జరిగే చర్చల్లో మహిళా నేత కార్మికులను కేంద్రంగా నిలపడం లక్ష్యంగా పెట్టుకున్నారు. చేనేత రంగానికి వారు అందిస్తున్న సేవలను మాత్రమే కాకుండా, వారి వ్యక్తిగత జీవిత ప్రయాణాలు, ఆకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలకు కూడా గుర్తింపు కల్పించనున్నారు.

 

***


(रिलीज़ आईडी: 2298697) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी