మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: విద్యా సంబంధిత ఫీజుల నియంత్రణ

प्रविष्टि तिथि: 12 AUG 2026 4:51PM by PIB Hyderabad

విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. కేంద్ర ప్రభుత్వం స్థాపించినకేంద్ర ప్రభుత్వ యాజమాన్యం కలిగిన, కేంద్రం నియంత్రణ పరిధిలో గల విద్యాసంస్థలు కాకుండా... ఇతర పాఠశాలలన్నీ సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం స్థాపించనికేంద్ర ప్రభుత్వ యాజమాన్యం లేని, కేంద్రం నియంత్రణ పరిధిలో లేని ఈ పాఠశాలల నిర్వహణ... ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రూపొందించిన నిబంధనలు, సూచనలకు అనుగుణంగా ఉంటుంది.

దీని ప్రకారం ప్రైవేటు పాఠశాలలు వసూలు చేసే ఫీజులు... విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రయోజనాలను పరిరక్షించే నియమ, నిబంధనలు... ఆయా నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలపై తీసుకునే చర్యలు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యా హక్కు (ఆర్‌టీఈచట్టం-2009 ప్రకారంఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ సమీపంలోని పాఠశాలలో ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంటుంది. ఆర్‌టీఈ చట్టం-2009లోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం... బలహీన వర్గాలు, వెనకబడిన వర్గాలకు చెందిన పిల్లలు ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశం పొందడానికి వీలుగా కనీసం 25 శాతం వరకు సీట్లకు రిజర్వేషన్ కల్పించాలి. అటువంటి పిల్లలకు వారి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు ఉచిత, నిర్బంధ విద్యను అందించాలి. ఆర్‌టీఈ చట్టం-2009లోని సెక్షన్ 13 ప్రకారం, వారి నుంచి ఎలాంటి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు.

విశ్వవిద్యాలయాలుగా పరిగణించే సంస్థలు యూజీసీ (విశ్వవిద్యాలయాలుగా పరిగణించే సంస్థలు) నిబంధనలు-2023 నియంత్రణలో ఉంటాయి. నిబంధన 24.బి.(2) ప్రకారం... సంబంధిత చట్టబద్ధ సంస్థలు నిర్దేశించిన ఫీజులు, సీట్ల సంఖ్యకు సంబంధించిన నియమాలను ఈ సంస్థలు తప్పనిసరిగా పాటించాలి. ప్రైవేటు కళాశాలలు, విశ్వవిద్యాలయాల విషయంలో... ప్రైవేటు విశ్వవిద్యాలయాలు సంబంధిత రాష్ట్ర చట్టాలకు అనుగుణంగా ఏర్పాటవుతాయి. ఫీజు సంబంధిత విషయాలు సహా ఇతర ప్రయోజనాల కోసం... ఈ సంస్థలు సంబంధిత చట్టంలోని నిబంధనలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన నియమ, నిబంధనలకు లోబడి పనిచేస్తాయి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)... తమ బోర్డుకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నిర్మాణం సహాపాఠశాల నిర్వహణ సంబంధిత అంశాలనూ నియంత్రించే ఉప-నియమాలను రూపొందించింది. ఈ ఉప-నియమాల ప్రకారంఏవైనా ఫీజుల సవరణ కోసం పాఠశాల యాజమాన్య కమిటీ నుంచి స్పష్టమైన ఆమోదం ఉండాలి. సంబంధిత ప్రభుత్వం నిర్దేశించిన ప్రక్రియను అనుసరించాలి. తప్పనిసరి కొనుగోళ్ల నిబంధనల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తం డబ్బు వసూళ్లను నిరోధించడానికీ సీబీఎస్ఈ తగిన చర్యలు చేపట్టింది. సీబీఎస్ఈ మార్గదర్శకాల ప్రకారం... పాఠశాలలు నిర్దిష్ట విక్రేతల నుంచే పుస్తకాలుయూనిఫాంలు, స్టేషనరీని కొనుగోలు చేయాలంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను బలవంతం చేయరాదు. తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం దీని లక్ష్యం.

విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా ఈ సమాచారాన్ని వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2298502) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी