|
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అటవీ హక్కుల క్లెయిమ్‌ల ప్రస్తుత స్థితిగతులు
प्रविष्टि तिथि:
12 AUG 2026 12:40PM by PIB Hyderabad
షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు-ఎఫ్ఆర్ఏ) చట్టం 2006, దాని నిబంధనల అమలు బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలదేనని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే రాజ్యసభకు వెల్లడించారు. కేవలం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చే నెలవారీ ప్రగతి నివేదికలను మాత్రమే కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ సమీకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌తో సహా దేశంలోని మొత్తం 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ అటవీ హక్కుల చట్టం అమలవుతోందని చెప్పారు.
30 జూన్ 2026 నాటికి హిమాచల్ ప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాల వారీగా దాఖలైన, ఆమోదం పొందిన, తిరస్కరించిన, పెండింగ్‌లో ఉన్న అటవీ హక్కుల క్లెయిమ్‌ల పూర్తి వివరాలను కింది అనుబంధంలో పొందుపరిచినట్లు మంత్రి వివరించారు. అయితే సామాజిక వర్గాల వారీగా, జిల్లాల వారీగా విభజించిన వివరాలను కేంద్ర మంత్రిత్వశాఖ నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
12.08.2026న రాజ్యసభలో శ్రీ అనురాగ్ శర్మ అడిగిన “అటవీ హక్కుల క్లెయిమ్‌ల స్థితి”కు సంబంధించి నక్షత్ర గుర్తు లేని ప్రశ్న నంబర్ 2861లోని (ఎ) నుంచి (సి) భాగాలకు ఇచ్చిన సమాధానానికి సంబంధించిన అనుబంధం
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 30.06.2026 వరకు అందిన సమాచారం ప్రకారం వ్యక్తిగత, సామాజిక కేటగిరీల కింద దాఖలైన, ఆమోదం పొందిన (పట్టాలు పంపిణీ చేసిన), తిరస్కరించిన, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల రాష్ట్రాల వారీ వివరాలు
|
వరుస సంఖ్య
|
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
|
30.06.2026 నాటికి అందిన క్లెయిమ్‌ల సంఖ్య
|
30.06.2026 నాటికి పంపిణీ చేసిన హక్కు పత్రాల సంఖ్య
|
30.06.2026 నాటికి తిరస్కరించిన క్లెయిమ్‌ల సంఖ్య
|
పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల సంఖ్య
|
|
వ్యక్తిగత
|
సామాజిక
|
మొత్తం
|
వ్యక్తిగత
|
సామాజిక
|
మొత్తం
|
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
285,115
|
3,294
|
288,409
|
226,667
|
1,822
|
228,489
|
58,395
|
1525
|
|
2
|
అస్సాం
|
208,062
|
8,582
|
216,644
|
84,861
|
2,575
|
87,436
|
16,379
|
112829
|
|
3
|
బిహార్
|
4,696
|
0
|
4,696
|
191
|
0
|
191
|
4,496
|
9
|
|
4
|
ఛత్తీస్‌గఢ్
|
890,220
|
57,259
|
947,479
|
481,432
|
52,636
|
534,068
|
406,787
|
6624
|
|
5
|
గోవా
|
9,978
|
399
|
10,377
|
1,250
|
20
|
1,270
|
1,901
|
7206
|
|
6
|
గుజరాత్
|
183,055
|
7,187
|
190,242
|
98,732
|
4,792
|
103,524
|
2,331
|
84387
|
|
7
|
హిమాచల్ ప్రదేశ్
|
6,100
|
868
|
6,968
|
942
|
156
|
1,098
|
56
|
5814
|
|
8
|
జార్ఖండ్
|
107,032
|
3,724
|
110,756
|
59,866
|
2,104
|
61,970
|
28,107
|
20679
|
|
9
|
కర్ణాటక
|
289,236
|
5,940
|
295,176
|
15,355
|
1,345
|
16,700
|
262,626
|
15850
|
|
10
|
కేరళ
|
44,580
|
1,018
|
45,598
|
29,523
|
284
|
29,807
|
13,216
|
2575
|
|
11
|
మధ్యప్రదేశ్
|
766,430
|
40,975
|
807,405
|
260,707
|
28,754
|
289,461
|
244,487
|
273457
|
|
12
|
మహారాష్ట్ర
|
397,897
|
11,259
|
409,156
|
199,667
|
8,668
|
208,335
|
172,631
|
28190
|
|
13
|
ఒడిశా
|
733,158
|
36,819
|
769,977
|
464,504
|
9,432
|
473,936
|
146,345
|
149696
|
|
14
|
రాజస్థాన్
|
113,162
|
5,213
|
118,375
|
49,215
|
2,551
|
51,766
|
65,921
|
688
|
|
15
|
తమిళనాడు
|
33,119
|
1,548
|
34,667
|
15,442
|
1,066
|
16,508
|
12,711
|
5448
|
|
16
|
తెలంగాణ
|
651,822
|
3,427
|
655,249
|
230,735
|
721
|
231,456
|
94,426
|
329367
|
|
17
|
త్రిపుర
|
201,055
|
67
|
201,122
|
131,615
|
65
|
131,680
|
68,472
|
970
|
|
18
|
ఉత్తర ప్రదేశ్
|
92,972
|
1,194
|
94,166
|
22,537
|
893
|
23,430
|
70,736
|
0
|
|
19
|
ఉత్తరాఖండ్
|
3,809
|
3,119
|
6,928
|
83
|
1
|
84
|
6,698
|
146
|
|
20
|
పశ్చిమ బెంగాల్
|
131,962
|
10,119
|
142,081
|
44,444
|
686
|
45,130
|
96,587
|
364
|
|
21
|
జమ్మూ, కాశ్మీర్
|
33,233
|
12,857
|
46,090
|
429
|
5,591
|
6,020
|
39,924
|
146
|
|
మొత్తం
|
51,86,693
|
2,14,868
|
54,01,561
|
24,18,197
|
1,24,162
|
25,42,359
|
18,13,232
|
10,45,970
|
(रिलीज़ आईडी: 2298281)
|