ఆయుష్
azadi ka amrit mahotsav

దేశంలో కొత్త ఆయుష్ వైద్య కళాశాలల ఏర్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 11 AUG 2026 5:27PM by PIB Hyderabad

ప్రజారోగ్యం రాష్ట్ర పరిధిలోని అంశం. కాబట్టి కొత్త ఆయుష్ విద్యా సంస్థల ఏర్పాటుపై ప్రాథమిక బాధ్యత.. ఒడిశా సహా సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుంది. అయితే, కేంద్ర ప్రాయోజిత పథకం జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్ఏఎం) ప్రకారం... ప్రభుత్వ రంగంలో ఆయుష్ బోధన సంస్థలు తగిన సంఖ్యలో అందుబాటులో లేని ప్రాంతాల్లో కొత్త ఆయుష్ కళాశాలల ఏర్పాటు కోస రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు ఆర్థికసాయాన్ని అందించే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ఎన్ఏఎం మార్గదర్శకాల పరిధిలో రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికల ద్వారా తగిన ప్రతిపాదనలను సమర్పించి.. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. ఒడిశా ప్రభుత్వ ప్రతిపాదన ఆధారంగా.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మయూర్‌భంజ్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు ఎన్ఏఎం కింద ఆమోదం లభించింది. ఎన్ఏఎం కింద సాయాన్ని పొందుతున్న ఆయుష్ విద్యా సంస్థల జాబితాను అనుబంధం-Iలో చూడొచ్చు.

అనుబంధం-I

2014-15 నుంచి 2026-27 వరకు జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్ఏఎం) కింద సహాయాన్ని పొందిన కొత్త ఆయుష్ విద్యా సంస్థల జాబితా

 క్ర.సం.

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం పేరు

సంస్థ పేరు

1

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ప్రకృతి వైద్య, యోగా వైద్య కళాశాల, విశాఖపట్నం

2

అస్సాం

ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, దుద్‌నోయ్

3

చండీగఢ్

ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, మణిమజ్రా, చండీగఢ్

4

గుజరాత్

సురేంద్రనగర్‌లో ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఏర్పాటు

5

జమ్మూ కాశ్మీర్

ప్రభుత్వ హోమియోపతీ వైద్య కళాశాల, రఖ్ హోషియారీ, కథువా జిల్లా

6

కర్ణాటక

ప్రభుత్వ ప్రకృతి వైద్య, యోగా కళాశాల, మైసూరు

 

 

దలైలామా ఉన్నత విద్యా సంస్థలో పురుషుల సీ-ఖాంగ్ (సోవా రిగ్పా) కళాశాల, శేషగిరిహల్లి, బిడాడి హోబలి, రామనగర జిల్లా.

7

మధ్యప్రదేశ్

ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, షహదోల్

 

 

ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, నర్మదాపురం

 

 

ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బాలాఘాట్

 

 

ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, మొరేనా

 

 

ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, సాగర్

 

 

ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఝబువా

8

మణిపూర్

హోమియోపతీ వైద్య కళాశాల, కెయిరావో, మణిపూర్‌

9

రాజస్థాన్

ప్రభుత్వ ఆయుర్వేద, యోగా, ప్రకృతి వైద్య కళాశాల, చక్షు, జైపూర్

10

సిక్కిం

గ్యాంగ్‌టాక్‌లోని డియోరాలీలో ఉన్న నామ్‌గ్యాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీలో సోవా రిగ్పా

11

హర్యానా

యునాని కళాశాల, హాస్పిటల్, అకేరా, నుహ్ జిల్లా

 

 

హోమియోపతి కళాశాల, ఆసుపత్రి, చాంద్‌పుర, అంబాలా కంటోన్మెంట్, అంబాలా జిల్లా

12

పశ్చిమ బెంగాల్

హౌరాలోని బేలూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో యోగా, ప్రకృతి వైద్య డిగ్రీ కళాశాల

13

ఉత్తరప్రదేశ్

ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కళాశాల, ఆసుపత్రి, వారణాసి

 

 

ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల, ఆసుపత్రి, అయోధ్య

14

తమిళనాడు

ప్రభుత్వ సిద్ధ కళాశాల, ఆసుపత్రి, పిలానీ

15

త్రిపుర

హోమియోపతీ వైద్య కళాశాల, పశ్చిమ త్రిపుర

16

ఉత్తరాఖండ్

 

హోమియోపతి మెడికల్ కళాశాల, ఆస్పత్రి, పరిశోధన కేంద్రం, డోయివాలా, డెహ్రాడూన్ జిల్లా

17

ఒడిశా

ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల, మయూర్‌భంజ్

 

కేంద్ర ఆయుష్ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర) శ్రీ ప్రతాపరావు జాదవ్ రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు. 


(రిలీజ్ ఐడి: 2298180) సందర్శకుల సూచీ సంఖ్య : : 40
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी