ఆయుష్
azadi ka amrit mahotsav

వ్యాధులకు చికిత్సతో పాటు నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి ముఖ్యం: శ్రీ ప్రతాపరావు జాదవ్

భారతదేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక శాస్త్రీయ పరిశోధన, ఆధారాలతో అనుసంధానించాలి: శ్రీ ప్రతాపరావు జాదవ్

ఆయుష్ మంత్రిత్వ శాఖ అయిదో పార్లమెంటరీ సలహా సంఘం సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్

విద్య, పరిశోధనలు, నాణ్యతా ప్రమాణాలు, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చేయటం ద్వారా ప్రకృతి వైద్య వ్యవస్థలను బలోపేతం చేయటంపై చర్చ

प्रविष्टि तिथि: 10 AUG 2026 9:13PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ఇవాళ జరిగిన ఆయుష్ మంత్రిత్వశాఖ అయిదో పార్లమెంటరీ సలహా సంఘం సమావేశానికి ఆయుష్ మంత్రిత్వ శాఖఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యతశ్రీ ప్రతాపరావు జాదవ్ అధ్యక్షత వహించారు. "యోగాప్రకృతి వైద్యం"పై ఈ సమావేశం జరిగిందినివారణతో కూడిన ఆరోగ్య సంరక్షణఆరోగ్యకరమైన జీవనశైలిపునరావాసంసంపూర్ణ సంక్షేమం వంటి వాటికి పెరుగుతున్న ప్రాముఖ్యతపై చర్చించారు.

 

భారతదేశ సంప్రదాయాల్లో యోగాప్రకృతి వైద్యానికి ప్రత్యేక స్థానం ఉందని కేంద్రమంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ అన్నారుఇవి ఆరోగ్య పరిరక్షణసంపూర్ణ సంక్షేమంపై దృష్టి సారించేమందుల అవసరం లేని సమగ్ర విధానాలను అందిస్తాయని తెలిపారుశారీరకమానసికభావోద్వేగ సంక్షేమానికి యోగా దోహదపడుతుందని… పోషకాహారంజీవనశైలి మార్పులుసహజ చికిత్సలుశరీరంలో అంతర్గత శక్తికి ప్రకృతి వైద్యం అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు.

 

ఆధునిక జీవనశైలితో ముడిపడున్న అసంక్రమిక వ్యాధులు, ఒత్తిడిమానసిక ఆరోగ్య సవాళ్లతో పెరుగుతున్న భారాన్ని శ్రీ ప్రతాపరావు జాదవ్ స్పష్టం చేశారుకేవలం వ్యాధులకు చికిత్స మాత్రమే కాకుండా… వ్యాధుల నివారణఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించటంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవశ్యకతను తెలిపారువృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండటంపునరావాసంమానసిక ఆరోగ్యంఒత్తిడినొప్పి నివారణమాతాశిశు సంక్షేమంసంపూర్ణ ఆరోగ్యానికి యోగప్రకృతి వైద్యం ఎంతో ఉపయోగపడతాయని చెప్పారువృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తూ.. భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతున్నందున శారీరక శ్రమమానసిక ఆరోగ్యంచలనశీలతస్వయంప్రతిపత్తిజీవన నాణ్యతను కాపాడుకోవటం అవసరమని అన్నారుఆరోగ్యకరమైనఉత్సాహకరమైన వృద్ధాప్యానికి మద్దతివ్వటంలో యోగాప్రకృతి వైద్యం కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

 

యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించి సంస్థాగత వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోందని శ్రీ ప్రతాపరావు జాదవ్ తెలిపారుమొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండీఎన్ఐవై), యోగా సర్టిఫికేషన్ బోర్డు (వైసీబీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (ఎన్ఐఎన్), సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి (సీసీఆర్ వైఎన్), నేచురోపతి రిజిస్ట్రేషన్ బోర్డు (ఎన్ఆర్‌బీద్వారా ఈ అభివృద్ధి జరుగుతుందన్నారువిద్యశిక్షణసర్టిఫికేషన్పరిశోధనఆరోగ్య సంరక్షణనాణ్యతా ప్రమాణాలువృత్తిపరమైన ప్రామాణీకరణలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టం చేశారుప్రకృతి వైద్యంలో రిజిస్ట్రేషన్నాణ్యతా ప్రమాణాలను బలోపేతం చేయటంలో నేచురోపతి రిజిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటు కీలకమని తెలిపారు.

 

సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు, ఆధారాలతో అనుసంధానించాల్సిన అవసరాన్ని శ్రీ ప్రతాపరావు జాదవ్ తెలిపారు. "సంప్రదాయమే మన బలంశాస్త్రీయతే ఆధారంనాణ్యతే ప్రాధాన్యతఅని అన్నారుఆధునిక వైద్యానికి యోగాప్రకృతి వైద్యం అనుబంధంగా ఉండాలని… వ్యాధి నివారణఆరోగ్య పరిరక్షణజీవనశైలి మార్పులుకోలుకునేలా చేయటంసంపూర్ణ ఆరోగ్యానికి మరింత ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు.

 

యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించి సంస్థాగతవిద్యాపరమైనపరిశోధనాప్రచార వ్యవస్థలపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అలర్మేళ్ మంగై డి ప్రజెంటేషన్ ఇచ్చారుదేశవ్యాప్తంగా 22 సీసీఆర్‌వైఎన్ యూనిట్లుయోగా కోర్సులు అందిస్తున్న 100కి పైగా విశ్వవిద్యాలయాలు, 5,000కి పైగా యోగా కేంద్రాలు, 113 గుర్తింపు పొందిన సంస్థలు, 29 గుర్తింపు పొందిన పర్సనల్ సర్టిఫికేషన్ సంస్థల గురించి ఈ ప్రజెంటేషన్ లో చెప్పారువీటితో పాటు భారతదేశంలో పెరుగుతున్న 10,500కి పైగా నిపుణులతో సమీక్షించిన పబ్‌మెడ్-జాబితాలోని ప్రచురణల పరిశోధనా రంగంపరిశోధనా సహకారండిజిటల్ ప్రచారంఆరోగ్యకమైన పర్యాటకంఉపాధి కల్పన వంటి కార్యక్రమాల గురించి వివరించారు.

 

పార్లమెంటరీ సలహా సంఘం సమావేశానికి హాజరైన లోక్‌సభ సభ్యుల్లో డా. స్వామి సచ్చిదానంద్ హరి సాక్షిశ్రీ అష్టీకర్ పాటిల్ నాగేశ్ బాపురావ్శ్రీ ఖలీలుర్ రెహమాన్శ్రీ నీలేశ్ ధ్యాన్ దేవ్ లంకేశ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఉన్నారురాజ్యసభ నుంచి శ్రీ ఘన్‌శ్యామ్ తివారీశ్రీ సదానంద్ మ్హాలు షెట్ తనవడేశ్రీ బాబూభాయ్ జెసంగ్‌భాయ్ దేశాయ్డాలక్ష్మీకాంత్ బాజ్‌పేయ్ పాల్గొన్నారుశాశ్వత ప్రత్యేక ఆహ్వానితులుగా లోక్‌సభ నుంచి శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటిశ్రీమతి జ్యోత్స్న చరణ్‌దాస్ మహంత్రాజ్యసభ నుంచి శ్రీమతి ధర్మశిల గుప్తాశ్రీమతి రేణుకా చౌదరి హాజరయ్యారుయోగాప్రకృతి వైద్య విద్య కోసం ఒకే విధమైన ఏకీకృత నియంత్రణ వ్యవస్థ అవసరం ఉందని పార్లమెంటు సభ్యులునిపుణులైన సభ్యులు అంగీకరించారు.

 

ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటేచా, ఆయుష్ మంత్రిత్వశాఖ సలహాదారు (యునానిడాక్టర్ ముక్తార్ అహ్మద్ ఖాస్మీయోగాప్రకృతి వైద్య నిపుణులుభాగస్వాములుమంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఏడు కీలక ప్రాధాన్యతా రంగాల ద్వారా యోగా, ప్రకృతి వైద్య వ్యవస్థల బలోపేతానికి ప్రణాళికలను మంత్రిత్వశాఖ రూపొందించింది.

యోగా, ప్రకృతి వైద్య రంగంలో విద్యసంస్థాగత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం.

రెండు వ్యవస్థల్లోనూ శాస్త్రీయ పరిశోధనలు, ఆధారాల సేకరణను ప్రోత్సహించటం.

యోగలో సర్టిఫికేషన్, గుర్తింపువృత్తిపరమైన ప్రమాణాలను బలోపేతం చేయటం.

ప్రకృతి వైద్యంలో రిజిస్ట్రేషన్, నాణ్యతా ప్రమాణాలుప్రామాణీకరణను మెరుగుపరచటం.

యోగ, ప్రకృతి వైద్యం ఆధారిత నివారణఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులో ఉండేలా విస్తరించటం.

ఆరోగ్య పర్యాటకం, వైద్య పర్యాటకం వంటివి ముఖ్యమైన అంశాలుగా భారతదేశంలో యోగాప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహించటం.

శాస్త్రీయ ఆధారాలు, నాణ్యతా ప్రమాణాల మద్దతుతో భారతదేశంలోని యోగాప్రకృతి వైద్యం సంప్రదాయాలను ప్రపంచ వేదికపై నిలపటం.

ఆరోగ్యకరమైన భారత్, వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా… యోగాప్రకృతి చికిత్సను ఆధారాలతోఅందరికీ అందుబాటులో ఉండే నివారణతో కూడిన ఆరోగ్య వ్యవస్థలుగా మరింత బలోపేతం చేయటంలో మంత్రిత్వశాఖపార్లమెంటుభాగస్వాముల మధ్య నిరంతర సహకార ప్రాముఖ్యతను ఈ సమావేశం స్పష్టం చేసింది.

 

****


(रिलीज़ आईडी: 2297534) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी