ఔషధాల విభాగం
azadi ka amrit mahotsav

‘మెడ్‌టెక్‌లో ఏఐ: కృత్రిమ మేధ ద్వారా ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు’ అంశంపై సమగ్ర నివేదికను విడుదల చేసిన కేంద్ర మంత్రి జె.పి. నడ్డా


ఆరోగ్య సంరక్షణలో బాధ్యతాయుత ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయడానికి ఐదు కీలక ప్రాధాన్యాలను సూచించిన నివేదిక

प्रविष्टि तिथि: 08 AUG 2026 5:52PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌ వేదికగా ఎఫ్ఐసీసీఐ సహకారంతో ఫార్మాస్యూటికల్స్ విభాగం నిర్వహించిన 9వ ఇండియా మెడికల్ డివైస్-2026లో... "మెడ్‌టెక్‌లో ఏఐ: కృత్రిమ మేధ ద్వారా ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు" అంశంపై విజ్ఞాన పత్రాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ జె. పి. నడ్డా ఈ రోజు విడుదల చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించడం నుంచి కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడం దాకా పెరుగుతున్న కృత్రిమ మేధ పాత్రను నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది.

ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్, ఎఫ్ఐసీసీఐలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ నివేదిక... దేశంలో అభివృద్ధి చెందుతున్న ఏఐ-ఆధారిత మెడ్‌టెక్ రంగాన్ని పరిశీలించి, ఆరోగ్య సంరక్షణ రంగంలో బాధ్యతాయుత ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన వ్యూహాత్మక చర్యలను వివరిస్తుంది. రోగ నిర్ధారణ, వైద్యపరమైన నిర్ణయాల్లో మద్దతు, కార్యాచరణ సామర్థ్యం, వైద్య పరికరాల ఆవిష్కరణలో ఏఐ పాత్రను ఇది అన్వేషిస్తుంది. పెద్ద ఎత్తున వినియోగాన్ని సాధ్యం చేయడానికి అవసరమైన నియంత్రణపరమైన, విధానపరమైన, వ్యవస్థాపరమైన జోక్యాలనూ ఇది గుర్తిస్తుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఇండియాఏఐ మిషన్, ఎస్ఏహెచ్ఐ, బీవోడీహెచ్, జాతీయ వైద్య పరికరాల విధానం-2023 ద్వారా దేశం ఇప్పటికే దీని కోసం ముఖ్యమైన పునాదులను నిర్మించిందని నివేదిక పేర్కొంది. విజయవంతమైన పైలట్ ప్రాజెక్టుల నుంచి ఏఐ పరిష్కారాలను పెద్ద ఎత్తున క్లినికల్ వినియోగానికి తీసుకువెళ్లడం ఒక పెద్ద సవాలు అవుతుందని ఈ నివేదిక అభిప్రాయపడింది.

దీని కోసం విచ్ఛిన్నంగా ఉన్న ఆరోగ్య సమాచారం, పరిమిత ఆధారాల వంటి సమస్యలను పరిష్కరించడం... అడాప్టివ్ ఏఐ కోసం ఊహించదగిన జీవితచక్ర-ఆధారిత నియంత్రణను అభివృద్ధి చేయడం... సహాయకరంగా ఉండే రీయింబర్స్‌మెంట్, సేకరణ వ్యవస్థను రూపొందించడం అవసరమని నివేదిక తెలిపింది. ఏఐ-సామర్థ్యం గల వైద్య సాంకేతికతల బాధ్యతాయుతమైన అభివృద్ధి, తయారీ, విస్తరణలో ప్రపంచ అగ్రగామిగా మారడం కోసం భారత్ తన సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, వైవిధ్యమైన వైద్య విధానాలు, పెరుగుతున్న మెడ్‌టెక్ తయారీ బేస్‌ను సద్వినియోగం చేసుకునే గొప్ప అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేస్తుంది.

ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం. శ్రీనివాస్, ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ, పరిశ్రమల ప్రోత్సాహక-అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి శ్రీ అమర్‌దీప్ సింగ్ భాటియా, జాతీయ ఆరోగ్య సంస్థ సీఈఓ శ్రీ సునీల్ కుమార్ బర్న్‌వాల్, ఎఫ్ఐసీసీఐ సెక్రటరీ జనరల్ శ్రీ అనంత్ స్వరూప్, ప్రభుత్వ సీనియర్ అధికారులు, పరిశ్రమల నాయకులు, మెడ్‌టెక్ రంగ భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నివేదికలోని ముఖ్యాంశాలు

దేశంలో ఏఐ-ఆధారిత మెడ్‌టెక్ అమలును వేగవంతం చేయడానికి ఐదు ప్రాధాన్యాలను నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది:

దేశపు అత్యంత తక్షణ, విస్తరించదగిన ఏఐ అవకాశాన్ని మెడ్‌టెక్ సూచిస్తుంది. ఇది నిపుణుల నైపుణ్యాన్ని నేరుగా వైద్య పరికరాల్లో పొందుపరచడానికి, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ మరింత అందుబాటులో ఉండేలా విస్తరించడానికి వీలు కల్పిస్తుంది.

ఏఐ రంగంలో అగ్రగామిగా నిలవడానికి భారత్ బలమైన పునాదులు కలిగి ఉంది. కానీ దానిని విస్తృతంగా అమలు చేయడానికి అవసరమైన వ్యవస్థ ఇంకా అందుబాటులో లేదు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, వైద్యుల ఆమోదం వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ... విచ్ఛిన్నమైన డేటా, మారుతున్న నిబంధనలు, పరిమితమైన రీయింబర్స్‌మెంట్ మార్గాల కారణంగా ఏఐ వినియోగం ఇప్పటికీ పరిమితంగానే ఉంది.

భారత్ ఈ విజయవంతమైన పైలట్ ప్రాజెక్టుల నుంచి సాధారణ క్లినికల్ వినియోగానికి మారాలంటే... వ్యవస్థాగతమైన ఈ మూడు లోపాలను పరిష్కరించాలి: ఏఐ కోసం సిద్ధంగా ఉన్న డేటా, ఆధారాలు... జీవితచక్రం ఆధారిత నియంత్రణ... ఏఐ-ఆధారిత విలువను గుర్తించే సేకరణ, రీయింబర్స్‌మెంట్ యంత్రాంగాలు.

ప్రాథమిక, ద్వితీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణకు నిపుణుల నైపుణ్యాన్ని విస్తరించడంలో సహాయపడటం ద్వారా ఏఐ-ఆధారిత రోగ నిర్ధారణలు తొలి భారీ-స్థాయి అనువర్తనంగా మారతాయని అంచనా. ఉత్పాదకతను మెరుగుపరచడంలో, ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండుటకు సంబంధించిన అసమానతలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

బాధ్యతాయుత ఏఐ-ఆధారిత మెడ్‌టెక్‌లో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, చెల్లింపుదారులు, పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య సమన్వయ చర్యలు అత్యవసరం.

పూర్తి నివేదికను ఇక్కడ చూడవచ్చు


(रिलीज़ आईडी: 2296636) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी